Samantha Naga Chaitanya: ఆసక్తికరంగా చైతూ.. సామ్ ట్విట్స్.. ఇక రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?

టాలీవుడ్ బ్యూటీఫుల్ స్టార్ కపూల్స్‏లలో అక్కినేని నాగచైతన్య.. సమంత జంట ఒకటి. వీరిద్దరి జోడీని అభిమానించేవారి సంఖ్య ఏ రేంజ్‍లో ఉంటుందో

Samantha Naga Chaitanya: ఆసక్తికరంగా చైతూ.. సామ్ ట్విట్స్.. ఇక రూమర్స్‏కు చెక్ పెట్టినట్టేనా ?
Nagachaitanya Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2021 | 11:40 AM

టాలీవుడ్ బ్యూటీఫుల్ స్టార్ కపూల్స్‏లలో అక్కినేని నాగచైతన్య.. సమంత జంట ఒకటి. వీరిద్దరి జోడీని అభిమానించేవారి సంఖ్య ఏ రేంజ్‍లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొద్ది రోజులుగా వీరి వైవాహిక జీవితం గురించి అనేక రూమర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య విభేధాలు తలెత్తాయని.. త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. ఇక ఈ మధ్య సామ్.. ఒంటరిగానే గోవా ట్రిప్ వెళ్లడం.. సోషల్ మీడియా ఖాతా నుంచి అక్కినేని పేరును తొలగించడం.. ఎమోషనల్ పోస్ట్స్ చేయడం వంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. దీంతో నిజాంగానే సామ్, చై… విడిపోతున్నారంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడిచింది. తాజాగా ఈ రూమర్స్‏కు లవ్ స్టోరీ ట్రైలర్ ఎండ్ కార్డ్ వేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నెల సెప్టెంబర్ 24న ఈ మూవీని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రూయునిట్. తాజాగా సోమవారం లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‏లో సంచలనం సృష్టించింది.

అయితే తాజాగా.. లవ్ స్టోరీ ట్రైలర్ పై సమంత స్పందించారు. సాయిపల్లవిని ట్యాగ్ చేస్తూ.. విన్నర్.. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సాయిపల్లవి స్పందిస్తూ.. థ్యాంక్యూ సో మచ్ అంటూ రిప్లై ఇచ్చింది. అయితే సామ్.. చైతూని ట్యాగ్ చేయకపోవడంతో అభిమానులలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని మళ్లీ గుసగుసలు వినిపించాయి. దీంతో అక్కినేని నాగచైతన్య ఈ రూమర్స్‏కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. చైతూ.. తన ట్విట్టర్ వేదికగా సమంత ట్వీట్‏కు రిప్లై ఇస్తూ.. థ్యాంక్స్ సామ్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు లేవని.. అవన్ని కేవలం గాసిప్స్ మాత్రమే అంటూ అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ట్వీట్‏తో తమపై వస్తున్న రూమర్స్‏కు చెక్ పెట్టారు నాగచైతన్య.

ట్వీట్స్..

Also Read: Prakash Raj: ప్రకాష్ రాజ్ మంచితనం.. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన విలక్షణ నటుడు..

Maestro: ఈ సినిమా తర్వాత రీమేక్ జోలికి అస్సలు వెళ్లను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మాస్ట్రో డైరెక్టర్..

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా