AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: ప్రకాష్ రాజ్ మంచితనం.. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన విలక్షణ నటుడు..

సాధారణంగా సినీ ప్రముఖులు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముంటుంటారన్న సంగతి తెలిసిందే. చాలా మంది ప్రముఖులు పేదవారికి

Prakash Raj: ప్రకాష్ రాజ్ మంచితనం.. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన విలక్షణ నటుడు..
Prakash Raj
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2021 | 11:02 AM

Share

సాధారణంగా సినీ ప్రముఖులు సామాజిక సేవ కార్యక్రమాల్లో ముంటుంటారన్న సంగతి తెలిసిందే. చాలా మంది ప్రముఖులు పేదవారికి పలు రకాలు సాయం చేయడమే కాకుండా.. పలు సేవా ఫౌండేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. రియల్ హీరో సోనూ సూద్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు అందరూ కష్టాల్లో ఉన్నవారికి తమ వంతూ సాయాన్ని అందిస్తున్నారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. రక్తదాన శిభిరంతో ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. కష్టాల్లో ఉన్నవారు అడగ్గానే ఆర్థికంగా.. నిత్యవసర సరుకులు, ఉపాది అవకాశాలను అందిస్తూ.. నిరుపేదల పాలిట అపద్భాంధవులుగా మారుతున్నాయి. అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం తన ఛారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తూ.. అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రకాష్ రాజ్. అటు కరోనా సమయంలోనూ తన ఛారిటీ ద్వారా ఎంతో మందికి సాయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ విలక్షణ నటుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ కుటుంబానికి అండగా నిలిచారు.. మైసూర్ శ్రీరంగపట్నంకు చెందిన ఓ కుటుంబం ఆర్థిక సమస్యలత ఇబ్బందులు పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్.. ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి జేసీబీ నడపడం రావడంతో అతడికి జేసీబీని బహుమతిగా అందించాడు. దీంతో వారి ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఒకరి జీవితంలో వెలుగులు నింపడం చాలా ఆనందంగా ఉందన్నారు. మనం సంపాదించిన దాంట్లో కొంత ఇలాంటి వారికి ఇవ్వడం సంతృప్తినిస్తుందన్నారు. తాను సంపాదించే వాటిలో కొంత మొత్తం ఇలా సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్.. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగులో వరుస సినిమాలతో తెగ బిజీగా గడిపేస్తున్నాడు.

Also Read: Paata Uttej: నా భవిష్యత్తుని ఇలా వదిలేశావ్ ఏంటమ్మ.. కన్నీరు పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్..

Maestro: ఈ సినిమా తర్వాత రీమేక్ జోలికి అస్సలు వెళ్లను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన మాస్ట్రో డైరెక్టర్..