Electric Scooter: అథర్ 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై దాదాపు రూ 24 వేల డిస్కౌంట్.. ఎక్కడ అంటే..
Electric Scooter : ఓ వైపు వాతావరణ కాలుష్యం.. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు దీంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పై దృష్టి పెట్టారు. దీంతో లేటెస్ టూ వీలర్స్ ట్రెండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పై
Electric Scooter : ఓ వైపు వాతావరణ కాలుష్యం.. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్ ధరలు దీంతో ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పై దృష్టి పెట్టారు. దీంతో లేటెస్ టూ వీలర్స్ ట్రెండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ప్రముఖ కంపెనీలు దృష్టి పెట్టాయి. రకరకాల మోడల్స్ తో యూత్ ని ఆకర్షిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ముందుగానే బుకింగ్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపీనీలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా కొత్తగా వస్తున్న మోడల్స్ లో కాస్త ఎక్కువ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ పొందిన అథర్ 450 ప్లస్ స్కూటర్ పై కూడా సదరు కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్నికల్ గా పాజిటివ్ రెస్పాన్స్ పొందడమే కాకుండా.. ధరలోనూ దాదాపు రూ.24వేల వరకూ తగ్గింపును అందిస్తుంది.. వివరాల్లోకి వెళ్తే..
అథర్ 450 ప్లస్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.03 లక్షలుగా ఉంది. అయితే మహారాష్ట్రలో మాత్రం ఈ స్కూటర్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దాదాపు 24వేల రూపాయల తగ్గింపుతో ఈ స్కూటర్ ను వినియోగదారులను అందించడానికి రంగం సిద్ధం చేసింది. దీంతో ఈ ఫేమస్ అథర్ 450 ప్లస్ స్కూటర్ ఎక్స్ దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల్లో పోలిస్తే.. మహారాష్ట్రలోని తక్కువ ధరకు లభిస్తున్నట్లు అయ్యింది. ధరలు తగ్గించక ముందు వరకూ అథర్ 450 ప్లస్ ఫేమ్ 2 ఇన్సెంటివ్ ఎక్స్ షోరూమ్ ధరధర సుమారు రూ.1.28 లక్షల వరకూ ఉంది.
బైక్ స్పెషాలిటీ:
6కే డబ్ల్యూ పీఎమ్ఎస్ఎమ్ మోటార్, 2.9కేడబ్ల్యూ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. అంతేకాదు ఈ స్కూటర్ ఎకో, రైడ్, స్పోర్ట్, వార్ప్ అనే నాలుగు రకాల మోడల్స్ లో లభ్యమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. 3.3 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే విధంగా డిజైన్ చేశారు. అథర్ 450ఎక్స్ ఐడీసీ మోడ్‌లో 116 కిలోమీటర్ల దూరం అందుకుంటుందని యాజమాన్యం ప్రకటించింది.
బ్యాటరీ పనితీరు:
బ్యాటరీ వాటర్ రెసిస్టెంట్, ఐపీ 67 రేటెడ్ ప్రజర్ డై కాస్ట్ అల్యూమినియం బ్యాటరీ ప్యాక్, ఫ్రంట్ అండ్ రేర్ కోసం రెండు డిస్క్ బ్రేక్‌లు, 22ఎల్ స్టోరేజీ, 7 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. అథర్ 450 ప్లస్ స్కూటర్ మోడల్ తో పాటు, రంగులు కూడా నేటి యూత్ ని ఆకర్షిస్తుంది. మార్కెట్ లో మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
Also Read: Snakebite:ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేస్తే ప్రాణాలు రక్షించవచ్చు.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన హోమియోపతి మందు ఏమిటో తెలుసా..