Andhra Pradesh: లారీ డ్రైవర్‌కు షాక్.. కళ్లముందే లక్షలు దోచుకెళ్లారు.. అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది..
Andhra Pradesh: కృష్ణాజిల్లా మైలవరం మండలంలోని పుల్లూరు గ్రామం వద్ద జరిగిన లారీ దారి దోపిడీ కలకలం రేపింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామం నుండి తూర్పు గోదావరి జిల్లా

Andhra Pradesh: కృష్ణాజిల్లా మైలవరం మండలంలోని పుల్లూరు గ్రామం వద్ద జరిగిన లారీ దారి దోపిడీ కలకలం రేపింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గ్రామం నుండి తూర్పు గోదావరి జిల్లా చొల్లంగిలో రెండు లారీలు ధాన్యం దిగుమతి చేసి వస్తుండగా దొంగలు తెగబడ్డారు. బియ్యం అమ్మగా వచ్చిన నగదు మొత్తాన్ని దొంగలు దోచుకెళ్లారు.
వివరాల్లోకెళితే.. కృష్ణా జిల్లాలో మైలవరం మండలం పుల్లూరులో దారి దోపిడీ జరిగింది. మండపేటలో పీడీఎస్ బియ్యం విక్రయించిన ఇద్దరు లారీ డ్రైవర్లు బియ్యం అమ్మిన 7 లక్షల రూపాయల సొమ్మును ఓ లారీ డ్రైవర్‌కు అప్పగించారు. అయితే.. ఆ 7 లక్షల సొమ్ముపై మరో లారీ డ్రైవర్ కన్నేసాడు. ఖమ్మం జిల్లాకు చెందిన దోపిడీ ముఠాతో డ్రైవర్ కుమ్మక్కై 7 లక్షల నగదును దోపిడీ చేశారు. ఈ ఘటన అనంతరం మరో డ్రైవర్ మైలవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల విచారణ చేపట్టారు. ఇద్దరు లారీ డ్రైవర్‌లపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మంలో స్పెషల్ టీమ్‌తో దోపిడీ ముఠా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
దోపిడీకి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తుల ముఠా ఖమ్మం జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. మొత్తం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దొంగతనం జరిగిన సొమ్ము 7 లక్షలను రికవర్ చేశారు. ఈ విషయాన్ని డీఎస్పీ మీడియాకు వెళ్లారు. ఇదిలా ఉండగా దోపిడీకి గురైన లారీ మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉండగా సదరు లారీలో కొంత రేషన్ బియ్యం ఉండడం చూసి పోలీసులే విస్తు పోవాల్సి వచ్చింది. రేషన్ బియ్యాన్ని అమ్మి, డబ్బు పోయే సరికి ధాన్యం అంటూ ఫిర్యాదు చేసి పోలీసులను ప్రక్క దారి పట్టిస్తున్నారా? అనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Also read:
Business Plan: యూట్యూబ్ చూసి లక్షలు సంపాదిస్తున్నాడు.. విజయ పథంలో దూసుకుపోతున్న జార్ఖండ్ యువకుడు