Viral Video: కుక్కను కాపాడేందుకు పిల్లి చేసిన పోరాటం చూస్తే ఆశ్చర్యపోతారు.. నిజమైన స్నేహం ఇదేనంటూ నెటిజన్ల కామెంట్లు

కుక్కలు, పిల్లులు ఒకరికొకరు ఎదురుగా పడ్డప్పుడల్లా పోరాడటం మనం చూశాం. కానీ ఈ వీడియోలో పిల్లి, ఓ కుక్కను కాపాడేందుకు మరో పిల్లితో కయ్యానికి కాలు దువ్వింది.

Viral Video: కుక్కను కాపాడేందుకు పిల్లి చేసిన పోరాటం చూస్తే ఆశ్చర్యపోతారు.. నిజమైన స్నేహం ఇదేనంటూ నెటిజన్ల కామెంట్లు
Cat Dog Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 14, 2021 | 9:47 AM

Viral Video: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వాటి ఫైటింగ్ వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట్లో వాలిపోయింది. ఇందులో కుక్కను కాపాడటానికి పిల్లి మరొక పిల్లితో పోరాడడం చూస్తే మనం ఆశ్చర్యపోతాం.

కుక్కను కాపాడటానికి పిల్లి చేసిన ఫైటింగ్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. జాతి వైరం మరిచి తన జాతి జంతువుతోనే కయ్యానికి కాలు దువ్వడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏముందంటే.. ఓ కుక్కకు పిల్లి నుంచి ప్రమాదం ఎదురైంది. కుక్క, పిల్లి రెండూ పోరాడుతున్నాయి. అయితే, పక్కనే బెంచ్ పై ఉన్న పిల్లి, వాటిని గమనించింది. కుక్కపై దాడి చేసిన సదరు పిల్లి.. కుక్కను గోడపై నుంచి పడేసింది. దీంతో బెంచ్ పై ఉన్న పిల్లి వెంటనే రంగంలోకి దూకింది. మరో పిల్లితో కయ్యానికి కాలు దువ్వి దానితో పోరాడింది.

సోషల్ మీడియాలో ఈ వీడియోను చాలా ఇష్టపడుతున్నారు. చాలామంది యూజర్లు దానిపై ఫన్నీ వ్యాఖ్యలు చేశారు. ‘కుక్క, పిల్లి స్నేహాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదు’ అంటూ ఒకరు, ‘ఈ వీడియో చూసిన తర్వాత, శత్రువులు కూడా నిజంగా స్నేహితులుగా మారగలరని అనిపిస్తుంది’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘పిల్లి తన జాతితోనే వైరం పెట్టుకుని మరీ కుక్కను కాపాడింది’ అంటూ వేరొకరు కామెంట్ చేశారు.

ఈ ఫన్నీ వీడియోను రెక్స్ చాప్‌మన్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. ఈ ఫన్నీ వీడియో 6.5 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకపోతోంది.

Also Read: బుల్లెట్‌ బండి పాటకు 70 ఏళ్ల బామ్మ డాన్స్‌! వైరల్ అవుతున్న వీడియో(Video)

Viral Video: బావిలో బుసలు కొడుతూ ఎదురు తిరిగిన కోబ్రా.. చివరకు ఏం జరిగిందంటే.. వీడియో వైరల్..

Viral Video: వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్