బుల్లెట్ బండి పాటకు 70 ఏళ్ల బామ్మ డాన్స్! వైరల్ అవుతున్న వీడియో(Video)
బుల్లెట్ బండి పాట హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అందాల దునియానే చూపిత్తపా’ అనే పాట ఏప్రిల్ 7న యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది మొదలు దూసుకుపోతోనే ఉంది. ‘ డుగ్గు డుగ్గు’ అంటూ ఈ పాట నెట్టింట్లో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.
బుల్లెట్ బండి పాట స్పీడు ఎక్కడా ఆగడంలేదు. సోషల్ మీడియాలో బుల్లెట్ బండిలాగే దూసుకుపోంది. ఎక్కడ చూసిన బుల్లెట్ బండి.. పాటే వినిపిస్తోంది. చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లుగా, కాలర్ ట్యూన్స్‌గా, పెళ్లి వేడుకల్లో.. ఇలా ఎక్కడ చూసిన ఈ పాటే మారుమోగుతోంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి 70 ఏళ్ల బామ్మల వరకు ఈ పాటకు స్టెప్పులేసేస్తున్నారు.
Published on: Sep 14, 2021 09:42 AM
వైరల్ వీడియోలు
Latest Videos