Crime News: 5 రూపాయల కోసం దారుణంగా కొట్టారు..! ఎక్కడంటే.! (Video)
ఆకలి మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఆకలేసి ఒక హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. తన బిల్లుకు చాలినంత డబ్బలులేక పోవడంతో మళ్లీ వచ్చి చెల్లిస్తానని చెప్పాడు. కానీ అతని మాట వినకుండా ఆ హోటల్ యజమాని ఆ కస్టమర్‌ని దారుణంగా కొట్టాడు. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఐదు రూపాయలు తక్కవైనందుకు హోటల్ యజమాని చేతిలో చావు దెబ్బలు తిన్నడో కస్టమర్. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాకు చెందిన జితేంద్ర దేహురి అనే వ్యక్తి ఘసీపూర్‌లోని ‘మా’ హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు. బిల్లు 45 రూపాయలు అయినట్లు హోటల్ యజమాని చెప్పాడు. కానీ తనవద్ద 40 రూపాయలే ఉండటంతో జితేంద్ర మిగతా డబ్బులు మళ్లీ వచ్చి ఇస్తానని చెప్పాడు. అందుకు ఒప్పుకోని హోటల్ యజమాని, అతను కొడుకు జితేంద్రను చితకబాదారు. అందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published on: Sep 14, 2021 09:40 AM
వైరల్ వీడియోలు
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

