ఏడాదిన్నర కూడా లేని ఈ చిన్నారి సంతోషం నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది! (Video)
ఎలాంటి కల్మషం లేని మనసుకు పెట్టింది పేరు చిన్నారులు. సంతోషం వస్తే నవ్వడం, నొప్పి కలిగితే ఏడవడం వీరికి తెలిసిందే ఇంతే.. అంతకు మించి ఎలాంటి కుళ్లు, కుతంత్రాలు వీరికి తెలియదు. అందుకే చిన్నారుల చిరునవ్వు ఎంతటి వారినైనా మాయ చేస్తుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నాసరే చిన్నారి నవ్వు వింటే చాలు ఒత్తిడంతా పరార్ అవ్వాల్సిందే.
నెట్టింట వైరల్ అవుతోన్న ఓ చిన్నారి నవ్వు అందరినీ ఆకట్టుకుంటోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఏడాదిన్నర కూడా లేని ఆ చిన్నారి పలికించిన హావభావాలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. కుటుంబ సభ్యులు పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నారు. అనంతరం డెలివరీ అయిన తర్వాత పిజ్జాను ఓపెన్ చేసే సమయంలో చిన్నారి అక్కడే ఉంది. దీంతో బాక్స్‌లో ఉన్న పిజ్జా కనిపించగానే చిన్నారి ఒక్కసారి ఫుల్ ఎగ్జైట్‌మెంట్ అయ్యింది. పిజ్జా చూసిన సంతోషంలో రెండు చేతులు పైకెత్తి గాల్లో ఊపుతూ కేరింతలు కొడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

