Viral Video: వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

Groom takes aashirwaad from bride: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నవ్వుకునేలా చేస్తే.. మరికొన్ని

Viral Video: వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
Groom Takes Aashirwaad From Bride
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Sep 14, 2021 | 7:28 AM

Groom takes aashirwaad from bride: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నవ్వుకునేలా చేస్తే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అలాంటి వీడియోల్లో మనసుకు హత్తుకునేవి కూడా ఉంటాయి. ఈ సరదా వీడియోల్లో వివాహానికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. తాజాగా.. ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి చాలామంది వరుడిని అభినందిస్తున్నారు. అయితే.. వరుడైవుండి భార్య కాళ్లు మొక్కడం ఎంటని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు వరుడు మంచి పనే చేశాడంటూ ప్రశంసిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి.. పలు విధాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో పెళ్లికొడుకు.. పెళ్లి కూతురికి పాదాబివందనం చేసి భార్య భర్తలో బంధానికి ఉదాహరణగా నిలిచాడు.

అయితే.. వివాహం పూర్తయిన తర్వాత వధువు వరుడి పాదాలకు మొక్కుతుంది. ఈ ఆచారం పురాతన కాలం నుంచి వివాహంలో భాగంగా ఉంది. అయితే.. ఓ వరుడు దీనికి కొంచెం భిన్నంగా ఆలోచించాడు. తన పాదాలను తాకిన.. వధువు పాదాలను తాకుతాడు. ఈ వీడియోలో.. వివాహ వేడుక అనంతరం వధువు, వరుడు కనిపిస్తారు. వివాహ ఆచారంలో భాగంగా వధువు వరుడి పాదాలను తాకడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వరుడు ఆమెను ఆమెను ఆపి.. వధువు పాదాలను తాకుతాడు. ఈ వీడియోను చూసిన వారంతా.. భార్య భర్తల బంధానికి ఈ వరుడు ఉదాహరణగా నిలిచాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే.. భర్త పాదాలను తాకుతున్న సమయంలో వద్దంటూ భార్య వెనక్కి వెళ్లేందుకు ఎగిరి గంతేస్తుంది.

వైరల్ వీడియో.. 

ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అప్‌లోడ్ చేశారు. అయితే.. ఈ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతోపాటు పలు కామెంట్లు చేస్తూ.. నూతన జంటను దీవిస్తున్నారు.

Also Read:

Funny Video: ముగ్గురు ముసలి వాళ్ల మధ్య యాక్షన్ ఫైట్‌..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం మీ వల్ల కాదు..

Viral Video: వావ్.! వాట్ ఏ క్రియేటివిటీ.. పిల్లలు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!