AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ముగ్గురు ముసలి వాళ్ల మధ్య యాక్షన్ ఫైట్‌..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం మీ వల్ల కాదు..

Funny Video: మారుతున్న కాలానికి తగ్గట్లు మనుషులు కూడా మారుతున్నారు. ప్రతి చిన్న విషయానికి వాదించడం, గొడవపడటం చేస్తున్నారు. యువకుల నుంచి మొదలు

Funny Video: ముగ్గురు ముసలి వాళ్ల మధ్య యాక్షన్ ఫైట్‌..! వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం మీ వల్ల కాదు..
Old Man
uppula Raju
|

Updated on: Sep 13, 2021 | 9:42 PM

Share

Funny Video: మారుతున్న కాలానికి తగ్గట్లు మనుషులు కూడా మారుతున్నారు. ప్రతి చిన్న విషయానికి వాదించడం, గొడవపడటం చేస్తున్నారు. యువకుల నుంచి మొదలుపెడితే ముసలివాళ్ల వరకు ఇదే తంతు కొనసాగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు ముసలివాళ్లు యాక్షన్ ఫైట్ చేస్తారు. చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. అయితే నెటిజన్లు ఈ వీడియోను తెగ లైక్‌ చేస్తున్నారు.

వీడియోలో ముగ్గురు వృద్ధులు పోట్లాడుకోవడం మనం గమనించవచ్చు. మొదటగా ముగ్గురు పెద్దల మధ్య ఏదో ఒక వాదన జరుగుతుంది. తర్వాత అందరు కోపంగా మారిపోతారు. దీంతో ఒకరిపై ఒకరు ముష్టి ఘాతాలను కురిపిస్తారు. వారి పోరాట శైలి చాలా భిన్నంగా ఉంది. పడుతూ లేస్తూ వారు చేస్తున్న ఫైటింగ్ చూస్తే నవ్వు ఆపుకోవడం ఎవరితరం కాదు. ఈ ఫన్నీ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రూపిన్ శర్మ షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

అయితే వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు షేర్లు, లైకులతో హోరెత్తిస్తున్నారు. ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, ముసలివారి ‘WWE ఫైట్ అదిరిపోయిందని అన్నాడు. మరొకరు మాస్కులు పెట్టుకొని ఫైట్ చేస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఇంకొందరు సినిమాలలో ట్రై చేస్తే బాగుంటుందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా నవ్విస్తుండటం విశేషం.

Viral Video: షేవింగ్‌ చేస్తుండగా పీక తెగింది.! ఒక్కసారిగా షాక్‌ గురైన కస్టమర్‌.. వైరల్‌గా మారిన వీడియో.

Drugs Case: తొమ్మిది గంటలపాటు నవదీప్‌ను విచారించిన ఈడీ.. అందుబాటులోనే ఉండాలంటూ ఆదేశాలు

Ola Electric Scooters: పూర్తిగా మహిళలతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ.. ఎంతమంది మహిళలకు ఉపాధి లభిస్తుందంటే..