Viral Video: షేవింగ్‌ చేస్తుండగా పీక తెగింది.! ఒక్కసారిగా షాక్‌ గురైన కస్టమర్‌.. వైరల్‌గా మారిన వీడియో.

Viral Video: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇలాంటి వీడియోల్లో కొన్ని సమాచారాన్ని...

Viral Video: షేవింగ్‌ చేస్తుండగా పీక తెగింది.! ఒక్కసారిగా షాక్‌ గురైన కస్టమర్‌.. వైరల్‌గా మారిన వీడియో.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 13, 2021 | 9:40 PM

Viral Video: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇలాంటి వీడియోల్లో కొన్ని సమాచారాన్ని అందిస్తే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇక యూట్యూబ్‌ ఛానల్‌లు వచ్చినప్పటి నుంచి ప్రాంక్‌ వీడియోల హవా బాగా ఎక్కువైపోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రాంక్‌ వీడియోలు ఆనందాన్ని కలిగిస్తే మరికొన్ని మాత్రం జనాలను భయాందోళనకు గురి చేస్తుంటాయి. ఇలాంటి భయానకమైన ప్రాంక్‌ వీడియోలు నెటిజన్లు బెంబేలేతిస్తుంటాయి.

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి షేవింగ్ చేసుకుందామనే ఉద్దేశంతో సెలూన్‌కు వచ్చాడు. ఆ సమయంలో షేవింగ్‌ చేసే వ్యక్తి గడ్డంపై రక్తంలా భావన కలిగించే ఎరుపు రంగును పోశాడు. అనంతరం గడ్డంపై సీజర్‌ను ఉంచి.. కస్టమర్‌ను కదిలించాడు. దీంతో రక్తాన్ని చూసిన సదరు కస్టమర్‌ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. పీక తెగిందేమోనన్న భయంతో కేకలు వేశాడు. నిజంగానే పీక తెగిందేమన్న భయంతో సొమ్మ సిల్లి పడిపోయాడు. ఈ ప్రాంక్‌ వీడియోను అక్కడే ఉన్న కొందరు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం.. ఇలా భయపెట్టించడం మంచి పద్ధతి కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by @jatt._.landd

Also Read: Samantha: నాగ చైతన్య ట్వీట్‌పై స్పందించిన సమంత.. ఏమన్నారో తెలుసా.?

Viral Photo: శరీరాన్ని విల్లులా వంచిన ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? భారీ పాన్‌ ఇండియా చిత్రంతో..

Ram Gopal Varma: ఇద్దరు బిగ్‌బాస్‌ భామల నడుమ వివాదాల రాముడు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆర్జీవీ ఫొటోలు..