Samantha: నాగ చైతన్య ట్వీట్‌పై స్పందించిన సమంత.. ఏమన్నారో తెలుసా.?

Samantha: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జోడిగా 'లవ్‌ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బ్యూటిఫుల్‌...

Samantha: నాగ చైతన్య ట్వీట్‌పై స్పందించిన సమంత.. ఏమన్నారో తెలుసా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 13, 2021 | 9:05 PM

Samantha: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జోడిగా ‘లవ్‌ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీపై భారీగా అంచనాలున్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా విజయవంతంగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్‌ సినిమాను విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్‌ 24న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్‌ వేగాన్ని పెంచేసేంది. ఇందులో భాగంగానే తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఎమోషనల్‌, లవ్‌ ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో ఉన్న ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్‌ సెట్‌ చేసే దిశగా వెళుతోంది. 02:19 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినిమా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కచ్చితంగా హిట్‌ అని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ట్రైలర్‌పై నటి, నాగచైతన్య సతీమణి సమంత కూడా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా నాగచైతన్య చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన సమంత.. ‘ఈ సినిమా కచ్చితంగా విజయంతమవుతుంది. చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ క్యా్ప్షన్‌ జోడించారు. ఫీల్‌ గుడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Also Read: Viral Photo: శరీరాన్ని విల్లులా వంచిన ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? భారీ పాన్‌ ఇండియా చిత్రంతో..

Ram Gopal Varma: ఇద్దరు బిగ్‌బాస్‌ భామల నడుమ వివాదాల రాముడు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆర్జీవీ ఫొటోలు..

Nabha Natesh: ఆమె స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఈస్మార్ట్‌ బ్యూటీ.