AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: శరీరాన్ని విల్లులా వంచిన ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? భారీ పాన్‌ ఇండియా చిత్రంతో..

Viral Photo: ఇటీవల ఫిట్‌నెస్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకూ అందరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అందమైన..

Viral Photo: శరీరాన్ని విల్లులా వంచిన ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? భారీ పాన్‌ ఇండియా చిత్రంతో..
Narender Vaitla
|

Updated on: Sep 13, 2021 | 7:59 PM

Share

Viral Photo: ఇటీవల ఫిట్‌నెస్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకూ అందరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అందమైన శరీరాకృతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఒకప్పుడు కేవలం హీరోలే ఎక్కువగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేవారు. కానీ ఇప్పుడు నటీమణులు కూడా జిమ్‌ బాట పడుతూ నిత్యం ఫిట్‌గా ఉండేందుకు కసరత్తులు చేస్తున్నారు. కేవలం తాము మాత్రమే చేయకుండా ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఫ్యాన్స్‌లోనూ ఫిట్‌నెస్‌పై ఆసక్తిని పెంచుతున్నారు.

ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తున్న నటీమణుల్లో సమంత, రష్మిక, రకుల్‌ ప్రీత్‌ సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇక బాలీవుడ్‌లో ఈ జాబితా చాలా పెద్దదేనని చెప్పాలి. వీరిలో ప్రముఖంగా వినిపించే పేరు అలియా భట్‌. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అనతికాలంలోనే అగ్ర హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లను దక్కించుకున్న ఈ చిన్నది తాజాగా తెలుగులో ఆర్‌.ఆర్.ఆర్‌ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది వర్కవుట్‌లకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ఒక రింగ్‌పై శరీరాన్ని విల్లును వంచినట్లు వంచి చేసిన వర్కవుట్‌కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘పర్‌ఫెక్షన్‌ సాధించాను’ అనే క్యాప్షన్‌ జోడించింది. మరి ఈ అందాల భామ వర్కవుట్‌ ఫొటోలను మీరూ ఓ సారి చూసేయండి.

Also Read: Ram Gopal Varma: ఇద్దరు బిగ్‌బాస్‌ భామల నడుమ వివాదాల రాముడు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆర్జీవీ ఫొటోలు..

Nabha Natesh: ఆమె స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఈస్మార్ట్‌ బ్యూటీ.

Allu Arjun: వావ్‌ వాటే సింప్లిసిటి.. రోడ్డు పక్కన టిఫిన్‌ చేసిన అల్లు అర్జున్‌. వైరల్‌ అవుతోన్న వీడియో..