Allu Arjun: వావ్‌ వాటే సింప్లిసిటి.. రోడ్డు పక్కన టిఫిన్‌ చేసిన అల్లు అర్జున్‌. వైరల్‌ అవుతోన్న వీడియో..

Allu Arjun: 'ఎంత 5 స్టార్‌ హోటళ్లో తిన్నా.. రోడ్డు పక్కన ఉండే బండిపై టిఫిన్‌ టేస్టే వేరు'.. ఇది శివాజి సినిమాలోని డైలాగ్‌. తాజాగా అలాంటి ఫీలింగ్‌నే ఎంజాయ్‌ చేశారు నటుడు..

Allu Arjun: వావ్‌ వాటే సింప్లిసిటి.. రోడ్డు పక్కన టిఫిన్‌ చేసిన అల్లు అర్జున్‌. వైరల్‌ అవుతోన్న వీడియో..


Allu Arjun: ‘ఎంత 5 స్టార్‌ హోటళ్లో తిన్నా.. రోడ్డు పక్కన ఉండే బండిపై టిఫిన్‌ టేస్టే వేరు’.. ఇది శివాజి సినిమాలోని డైలాగ్‌. తాజాగా అలాంటి ఫీలింగ్‌నే ఎంజాయ్‌ చేశారు నటుడు అల్లు అర్జున్. ఐకాన్‌ స్టార్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ఫ’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు పార్టులుగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం బన్నీ తాజాగా కాకినాడ వెళ్లిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా తాజాగా బన్నీ రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరుగుతోన్న షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే తూర్పు గోదావరి జిల్లా గోకవరం మీదుగా వెళుతోన్న సమయంలో బన్నీ రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లో టిఫిన్‌ చేశారు. ఓ బడా హీరో ఇలా తమ హోటల్‌లో టిఫిన్‌ చేయడం పట్ల సదరు హోటల్‌ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక బన్నీ ఫ్యాన్స్‌ తమ అభిమాన హీరో సింప్లిసిటికి ఫిదా అవుతున్నారు.

టిఫిన్‌ చేసిన అనంతరం బన్నీ బిల్‌ చేయడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ షాపు యాజమాని వద్దంటూ వారిస్తుండడం, కానీ బన్నీ మాత్రం డబ్బు ఇచ్చేంత వరకు అక్కడి నుంచి వెళ్లకపోవడానికి అక్కడే ఉన్న కొందరు వీడియో తీశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మరి వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Ram Charan: రామ్‌చరణ్‌ క్రేజ్‌ను వాడుకునే పనిలో పడ్డ ప్రముఖ ఓటీటీ సంస్థ.. బ్రాండ్‌ అంబాసిడర్‌ కోసం ఏకంగా..

Click on your DTH Provider to Add TV9 Telugu