AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్‌చరణ్‌ క్రేజ్‌ను వాడుకునే పనిలో పడ్డ ప్రముఖ ఓటీటీ సంస్థ.. బ్రాండ్‌ అంబాసిడర్‌ కోసం ఏకంగా..

Ram Charan As Brand Ambassador: ఓటీటీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు దూసుకుపోతోంది. బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం, ప్రేక్షకులు కూడా..

Ram Charan: రామ్‌చరణ్‌ క్రేజ్‌ను వాడుకునే పనిలో పడ్డ ప్రముఖ ఓటీటీ సంస్థ.. బ్రాండ్‌ అంబాసిడర్‌ కోసం ఏకంగా..
Narender Vaitla
|

Updated on: Sep 13, 2021 | 3:22 PM

Share

Ram Charan As Brand Ambassador: ఓటీటీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు దూసుకుపోతోంది. బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం, ప్రేక్షకులు కూడా ఓటీటీలకు మొగ్గుచూపుతుండడంతో వీటి మార్కెట్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థల పోటీ కూడా అదే స్థాయిలో పెరిగింది. దీంతో ప్రమోషన్‌ను పెంచుకునే పనిలో పడ్డాయి ఓటీటీ సంస్థలు. ఇందులో భాగంగానే డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ తాజాగా భారీ ఎత్తుగడకు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెండు వీడియో యాడ్స్‌తో పాటు ప్రింట్‌ ప్రకటనల చేసేందుకు రామ్‌ చరణ్‌ ఒకే చెప్పారని సమాచారం. ఇందుకోసం చెర్రీ ఏకంగా రూ. 3 కోట్లు తీసుకోనున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆచార్య, ఆర్‌.ఆర్‌.ఆర్‌ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో చెర్రీ క్రేజ్‌ను తమ సంస్థ ప్రమోషన్‌కు ఉపయోగించుకోవాలని భావించిన సదరు ఓటీటీ సంస్థ రామ్‌ చరణ్‌కు అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది.

మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆచార్య, ఆర్‌.ఆర్‌.ఆర్‌లతో పాటు శంకర్‌ దర్శకత్వంలోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న సినిమాలే కావడం విశేషం.

Also Read: Bigg Boss 5 Telugu: మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఎవరు? హౌజ్‌లో దమ్మున్న మగాడు ఎవరు? సరయు సంచలన కామెంట్స్‌.

Sai Dharam Tej Health Update: కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్‌.. అపోలోలో కొనసాగుతున్న చికిత్స

Krithi Shetty: ‘5 స్టార్’ హీరోయిన్‌గా క్రితి శెట్టి… యస్.. ఇదో రేరెస్ట్ రికార్డ్!