Bigg Boss 5 Telugu: మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఎవరు? హౌజ్‌లో దమ్మున్న మగాడు ఎవరు? సరయు సంచలన కామెంట్స్‌.

బిగ్‌బాస్‌ 5 సరయు: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ మొదలై వారం రోజులు గడిచింది. షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. తొలివారంలోనే ఎలిమినేషన్‌ ఘట్టాన్ని ప్రారంభించిన బిగ్‌బాస్‌...

Bigg Boss 5 Telugu: మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఎవరు? హౌజ్‌లో దమ్మున్న మగాడు ఎవరు? సరయు సంచలన కామెంట్స్‌.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 13, 2021 | 4:10 PM

బిగ్‌బాస్‌ 5 సరయు: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ మొదలై వారం రోజులు గడిచింది. షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. తొలివారంలోనే ఎలిమినేషన్‌ ఘట్టాన్ని ప్రారంభించిన బిగ్‌బాస్‌ సరయును ఎలిమినేట్‌ చేశారు. యాంకర్ రవి, కాజల్, జెస్సీ, హమీదా, మానస్, సరయు.. తొలివారం నామినేషన్స్‌లో ఉండగా.. అనూహ్యంగా సరయు ఎలిమినేట్ అయ్యింది. నిజానికి సరయు ఎక్కువ రోజులు షోలో ఉంటుందని అందరూ భావించినప్పటికీ హౌజ్‌ నుంచి వెనుదిరగడం గమనార్హం. ఇక ముక్కు సూటిగా.. ఇంకా చెప్పాలంటే బోల్డ్‌గా మాట్లాడే సరయూ షో నుంచి బయటకు రాగానే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలిమినేట్‌ కాగానే వేదికపైనే పలు కాంట్రవర్సీ స్టేట్‌మెంట్‌ను ఇచ్చిన సరయు.. తాజాగా అరియానా గ్లోరితో జరిగిన బిగ్‌బాస్‌ బజ్‌ కార్యక్రమంలో మరిన్ని కామెంట్లు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా సరయు మాట్లాడుతూ.. ప్రస్తుతం హౌజ్‌ కెప్టెన్‌గా ఉన్న సిరి మగ వారిని అడ్డం పెట్టుకొని ఆడుతుదంటూ సంచలన కామెంట్లు చేసింది. ఇక యాంకర్‌ రవి గురించి మాట్లాడుతూ.. అతను మంచోడిలాగా నీతి సూత్రాలు భోదిస్తాడు కానీ.. అతనిలో విషయే లేదని చెప్పేసింది. వీజే సన్నీకి అసలు క్యారెక్టర్‌ లేదంటూ అతని ఫొటోను పగలగొట్టేసింది.

అంతటితో ఆగని సరయు షణ్ముఖ్‌, జశ్వంత్‌లను చీల్చి చెండాడింది. షణ్ముఖ్‌ని ఉద్దేశిస్తూ.. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే.. మగాడివి అయితే సింగిల్‌ ఆడు. లేదంటే గాజులు వేసుకొని మూలన కూర్చో, నేను గాజులు వేసుకున్నా కూడా సింగిల్‌గానే ఆడతా.. నువ్వు ఆడలేవు కాబట్టి మూలన కూర్చో అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌లో దమ్మున్న మగాడు ఎవరైనా ఉన్నారంటే అది విశ్వ ఒక్కడే అని చెప్పింది. మరి బిగ్‌బాస్‌ షో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Also Read: Sai Dharam Tej Health Update: కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్‌.. అపోలోలో కొనసాగుతున్న చికిత్స

Teamindia Skipper: కెప్టెన్సీ మార్పుపై స్పందించిన బీసీసీఐ.. అన్ని ఫార్మాట్లలో అతనే కెప్టెన్ అంటూ క్లారిటీ

Viral Video: న్యూ హెయిర్ స్టైల్‌ కోసం ట్రై చేస్తే ఇలా అయ్యిందేంట్రా బాబు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో..