Sai Dharam Tej Health Update: కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్‌.. అపోలోలో కొనసాగుతున్న చికిత్స

Sai Dharam Tej Health Update: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే మెగా అభిమానులంతా ఆందోళకు గురయ్యారు.

Sai Dharam Tej Health Update: కోలుకుంటున్న సాయి ధరమ్ తేజ్‌..  అపోలోలో కొనసాగుతున్న చికిత్స
Sai Dharam Tej
Follow us
uppula Raju

|

Updated on: Sep 13, 2021 | 4:49 PM

Sai Dharam Tej Health Update: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే మెగా అభిమానులంతా ఆందోళకు గురయ్యారు. ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు తేజ్‏ను సమీపంలోని మెడికవర్ ఆసుపత్రికి చేర్పించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

అయితే అపోలోఆసుత్రి వైద్యులు హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నట్లు తెలిపారు. నిన్న (ఆదివారం) సాయి తేజ్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ఈ మేరకు సోమవారం సాయి ధరమ్‌ తేజ్‌ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ‘‘సాయి తేజ్‌ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారు. నిన్న ఆయన కాలర్‌ బోన్‌కు చేసిన ఆపరేషన్‌ విజయంతం అయ్యింది. ప్రస్తుతం ఆయన చికత్సకు స్పందిస్తున్నారు. మొదటిలో ఉన్న దానికంటే వెంటిలేటర్‌ అవసరం ఇప్పుడు తగ్గింది. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉంది’’ అని డాక్టర్లు తెలిపారు.

కాగా పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ , నిహారిక, మెగాస్టార్ సతీమణి సురేఖ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆసుపత్రికి వెళ్లి తేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు తేజ్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Gmail: ఇన్‌బాక్స్‌లో లెక్కలేనన్ని మెయిల్స్‌ ఉన్నాయా.? ఒకేసారి ఎలా డిలెట్‌ చేయాలో తెలియట్లేదా.. ఈ ట్రిక్‌ ఫాలో అవ్వండి.

Teamindia Skipper: కెప్టెన్సీ మార్పుపై స్పందించిన బీసీసీఐ.. అన్ని ఫార్మాట్లలో అతనే కెప్టెన్ అంటూ క్లారిటీ

Viral Video: న్యూ హెయిర్ స్టైల్‌ కోసం ట్రై చేస్తే ఇలా అయ్యిందేంట్రా బాబు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో..