- Telugu News Photo Gallery Technology photos Do You Know This Simple Trick For Deleting All Inbox Mails At A Time | How To Delete All Mails
Gmail: ఇన్‌బాక్స్‌లో లెక్కలేనన్ని మెయిల్స్ ఉన్నాయా.? ఒకేసారి ఎలా డిలెట్ చేయాలో తెలియట్లేదా.. ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.
Gmail: ఇన్‌బాక్స్‌లో ఉండే మెయిల్స్‌ను ఒకేసారి డిలీట్ చేయడం సాధ్యం కాదు. అయితే ఓ చిన్న ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల ఒకేసారి మెయిల్స్‌ను డిలీట్ చేసే అవకాశం ఉందని మీకు తెలుసా.?
Updated on: Sep 13, 2021 | 2:25 PM

ప్రస్తుతం ఫోన్ నెంబర్ ఎలా తప్పనిసరిగా మారిందో మెయిల్ ఐడీ కూడా అలాగే మారింది. దీంతో ప్రతీ రోజూ లెక్క లేనన్నీ మెయిల్స్ వస్తుంటాయి.

ఈ కారణంగా ఇన్‌బాక్స్‌లో మెయిల్స్ వేల సంఖ్యలో నిండిపోతుంటాయి. అయితే వీటిని ఒకేసారి డిలీట్ చేయడం ఇబ్బందిగా మారుతుంది. కానీ ఓ చిన్న సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వడం వల్ల పెద్ద మొత్తంలో ఒకేసారి మెయిల్స్‌ను డిలీట్ చేయొచ్చు.

ఇందుకోసం ముందుగా వెబ్ వెర్షన్‌లో జీమెయిల్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం సెర్చ్ బాక్స్‌లో 'Is:Read' అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ చేయాలి. వెంటనే మీరు అంతకుముందే చదివేసిన అన్ని మెయిల్స్ కనిపిస్తాయి. మెయిల్స్‌పైన ఉండే 'ఆల్ సెలక్ట్ బాక్స్' ఆప్షన్‌పై క్లిక్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది.

అయితే ఇలా కేవలం 50 మెయిల్స్ మాత్రమే సెలక్ట్ అవుతాయి. మీరు అంతకంటే ఎక్కువ సెలక్ట్ చేసుకోవాలంటే.. "సెలెక్ట్ ఆల్ కన్వర్షేషన్స్ థట్ మ్యాచ్ థిస్ సెర్చ్" ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీరు చదివేసిన అన్ని మెయిల్స్ సెలక్ట్ అవుతాయి. అనంతరం డిలీట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి అన్నీ ఒకేసారి డిలీట్ చేయొచ్చు.

ఈ ఫీచర్ ద్వారా ఎన్ని మెయిల్స్ అయినా ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. అయితే ఏవైనా అవసరమైన మెయిల్స్ ఉంటే మాత్రం డిలీట్ చేసే సమయంలో టిక్ తీయాలనే విషయాన్ని మర్చిపోకూడదు.





























