- Telugu News Photo Gallery Cinema photos Actor Uttej's wife passes away due to cancer; Chiranjeevi, jeevitha, prakash raj visits hospital and offers condolences to family
Uttej Wife Died: అర్ధాంగిని కోల్పోయి కన్నీరుమున్నీరు అయిన ఉత్తేజ్..
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. నటుడు ఉతేజ్ సతీమణి పద్మావతి అనారోగ్యంతో కన్నుమూశారు.
Updated on: Sep 13, 2021 | 1:39 PM

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి అనారోగ్యంతో కన్నుమూశారు.

హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 8.30 నిమిషాలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

అర్ధాంగి మరణంతో ఒక్కసారిగా ఉత్తేజ్ కుప్పకూలిపోయారు. కనీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి హాస్పటల్‌కు చేరుకున్నారు. చిరుని చూసి ఉత్తేజ్ మరింతగా ఉద్వేగానికి గురయ్యారు.

చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్‌తో పాటు పలువురు నటీనటులు.. ఆసుపత్రికి వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మెగాస్టార్, జీవిత రాజశేఖర్ సహా పలువురు నటులు ఉత్తేజ్ ఆయన కుమార్తెలను ఓదార్చే ప్రయత్నం చేశారు.

గుండెలవిసేలా రోదిస్తున్న ఉత్తేజ్‌ను చూసి ప్రకాష్ రాజ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.





























