Teamindia Skipper: కెప్టెన్సీ మార్పుపై స్పందించిన బీసీసీఐ.. అన్ని ఫార్మాట్లలో అతనే కెప్టెన్ అంటూ క్లారిటీ

BCCI: టీ 20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ స్థానంలో రోహిత్ శర్మను వన్డే, టీ 20 జట్ల కెప్టెన్‌గా నియమిస్తున్నారంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది.

Teamindia Skipper: కెప్టెన్సీ మార్పుపై స్పందించిన బీసీసీఐ.. అన్ని ఫార్మాట్లలో అతనే కెప్టెన్ అంటూ క్లారిటీ
Virat kohi
Follow us
Venkata Chari

|

Updated on: Sep 13, 2021 | 2:20 PM

Virat Kohli-Rohit Sharma: టీ 20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డేతోపాటు టీ 20 టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. దీంతో భారత సారథిని మార్చే ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చింది. టీ 20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ స్థానంలో రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమించాలనే వార్తలను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఖండించింది. బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ సోమవారం ఆ నివేదిక నిరాధారమని పేర్కొన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే ఉంటాడని తేల్చి చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలు తప్పని ఆయన అన్నారు.

బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, “ఇవన్నీ మీడియా తయారు చేసిన వంటకాలు. స్ల్పిట్ కెప్టెన్సీ గురించి బోర్డు ఇంతవరకు చర్చించలేదు. అలాంటి ఆలోచనే చేయలేదు. ప్రస్తుతానికైతే విరాట్ కోహ్లీనే అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు” అని తెలిపాడు.

అసలు ఆ నివేదికలో ఏముంది? టీమిండియాలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట కెప్టెన్ మార్పు. అప్పుడప్పుడూ కొన్ని నివేదికలు వెలువడినా.. బీసీసీఐ మాత్రం సారథ్య బాధ్యతల్లో మార్పును మాత్రం చేయడం లేదు. తాజాగా మరో నివేదిక విడుదలైంది. దీని ప్రకారం, విరాట్ కోహ్లీ వన్డేలు, టీ 20 ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తోంది. టీ 20 ప్రపంచకప్ ఈ మార్పు చూడవచ్చంటూ ఓ మీడియా నివేదికను విడుదల చేసింది. విరాట్‌కు బదులుగా, రోహిత్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌గా నియమించినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, త్వరలో విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను వన్డే, టీ 20 కెప్టెన్‌గా ప్రకటించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్‌కు అవకాశం వచ్చినప్పుడల్లా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లోనూ అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కమాండ్ బాధ్యతలు చేపట్టే ముందు రోహిత్ ఐపీఎల్ 2021 లో కెప్టెన్‌గా కనిపిస్తాడు.

“టీ 20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా కెప్టెన్సీకి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. అతను తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ తన నాయకత్వ బాధ్యతను రోహిత్‌తో పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు” ఆ సంస్థ బీసీసీఐపై వ్యంగ్యంగా వార్తను ప్రచురించింది.

దీంతో ఈ నివేదికపై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించి, ఆ కథనాలు కేవలం కల్పితమంటూ కొట్టిపారేశాడు. ఇంతవరకు అలాంటి చర్చ జరగలేదని తేల్చి చెప్పాడు.

Also Read: India vs England: భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు పాక్‌తో జతకడుతోన్న ఇంగ్లండ్.. వారిని కూడా వెనక్కు రప్పించేందుకు కుట్రలు

7 ఓవర్లలో 9 వికెట్లు.. ఇచ్చింది కేవలం 11 పరుగులు.. ఈ బౌలర్ ప్రతిభకు ఫిదా అవుతోన్న క్రికెట్ ప్రేమికులు!

CPL 2021: విండీస్‌లో ముంబై ప్లేయర్ ప్రతాపం.. 232 స్ట్రైక్‌తో బౌలర్లకు చుక్కలు.. 22 బంతుల్లోనే ఫలితం రాబట్టిన ప్లేయర్ ఎవరంటే?