AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPL 2021: విండీస్‌లో ముంబై ప్లేయర్ ప్రతాపం.. 232 స్ట్రైక్‌తో బౌలర్లకు చుక్కలు.. 22 బంతుల్లోనే ఫలితం రాబట్టిన ప్లేయర్ ఎవరంటే?

Kieron Pollard: కీరాన్ పొలార్డ్ బ్యాట్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 20 ఓవర్ల మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే విజయతీరాలకు చేర్చాడు.

CPL 2021: విండీస్‌లో ముంబై ప్లేయర్ ప్రతాపం.. 232 స్ట్రైక్‌తో బౌలర్లకు చుక్కలు.. 22 బంతుల్లోనే ఫలితం రాబట్టిన ప్లేయర్ ఎవరంటే?
Kieron Pollard
Venkata Chari
|

Updated on: Sep 13, 2021 | 1:27 PM

Share

CPL 2021: రోహిత్ శర్మకు శుభవార్త అందింది. ఐపీఎల్ 2021కి ముందు, ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న వెస్టిండీస్‌ ప్లేయర్ సీపీఎల్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కీరాన్ పొలార్డ్ బ్యాట్‌తో మైదానంలో కలకలం సృష్టించాడు. 20 ఓవర్ల మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే ఫలితాన్ని చేరుకోవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఒకటి లేదా రెండు కాదు మొత్తం 6 బంతులను 231.80 స్ట్రైక్ రేట్ బాదేశాడు. సీపీఎల్ 2021 లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో, పొలార్డ్ ట్రిన్‌బాగో తరపున విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో పేట్రియాట్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. అతను 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేశాడు. జాషువా డి సిల్వా పేట్రియాట్స్ తరపున 45 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీని తర్వాత రూథర్‌ఫోర్డ్, బ్రావో తలో 25 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌లో అలీ ఖాన్ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మారి 3 వికెట్లు తీశాడు.

కీరాన్ పొలార్డ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ట్రిన్‌బాగో జట్టు విజయం సాధించడానికి 20 ఓవర్లలో 148 పరుగులు కావాల్సి ఉంది. కానీ, 52 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కీరాన్ పోలార్డ్ క్రీజులోకి వచ్చాడు. కీరన్ పొలార్డ్ 32 నిమిషాల బ్యాటింగ్‌లో 22 బంతులను ఎదుర్కొన్నాడు. ఈ 22 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. పొలార్డ్ బ్యాట్‌ 232 స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టింది. ఇందులో 5 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి. అంటే, 51 పరుగులలో 42 పరుగులను కేవలం 8 బంతుల్లో బౌండరీల ద్వారా సాధించాడు.

ఐపీఎల్ 2021 రెండో దశ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ టీం మద్య సెప్టెంబర్ 19న జరగనుంది. ఇప్పటికే అక్కడి చేరిన ప్లేయర్లు క్వారంటైన్‌లో ఉన్నారు.

Also Read: Viral Video: స్టేడియం పైకప్పు నుంచి కింద పడబోయిన పిల్లి.. ప్రేక్షకుల సమయస్ఫూర్తితో ఎలా ఆదుకున్నారో తెలుసా? వైరలవుతోన్న వీడియో

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీలో మార్పు.. తప్పుకోనున్న విరాట్ కోహ్లీ.. పరిమిత ఓవర్లలో ఇక అతనిదే సారథ్యం..?

CPL 2021: 9 భారీ సిక్సర్లతో ఐపీఎల్ ప్రత్యర్థులను హెచ్చరించిన రాజస్థాన్ ప్లేయర్.. కీలక ప్లేయర్ల లోటు తీర్చేందుకు సిద్ధమైన కివీస్ కీపర్