T20 World Cup: టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీలో మార్పు.. తప్పుకోనున్న విరాట్ కోహ్లీ.. పరిమిత ఓవర్లలో ఇక అతనిదే సారథ్యం..?

Rohit Sharma-Virat Kohli: రోహిత్‌కు అవకాశం వచ్చినప్పుడల్లా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ నిలిచిన సంగతి తెలిసిందే.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీలో మార్పు.. తప్పుకోనున్న విరాట్ కోహ్లీ.. పరిమిత ఓవర్లలో ఇక అతనిదే సారథ్యం..?
Virat Rohit
Follow us
Venkata Chari

|

Updated on: Sep 13, 2021 | 9:57 AM

Rohit Sharma-Virat Kohli: టీమిండియాలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట కెప్టెన్ మార్పు. అప్పుడప్పుడూ కొన్ని నివేదికలు వెలువడినా.. బీసీసీఐ మాత్రం సారథ్య బాధ్యతల్లో మార్పును మాత్రం చేయడం లేదు. తాజాగా మరో నివేదిక విడుదలైంది. దీని ప్రకారం, విరాట్ కోహ్లీ వన్డేలు, టీ 20 ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని తెలుస్తోంది. టీ 20 ప్రపంచకప్ ఈ మార్పు చూడవచ్చంటూ ఓ మీడియా నివేదికను విడుదల చేసింది. విరాట్‌కు బదులుగా, రోహిత్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్‌గా నియమించినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, త్వరలో విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను వన్డే, టీ 20 కెప్టెన్‌గా ప్రకటించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. రోహిత్‌కు అవకాశం వచ్చినప్పుడల్లా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లోనూ అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. టీ 20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కమాండ్ బాధ్యతలు చేపట్టే ముందు రోహిత్ ఐపీఎల్ 2021 లో కెప్టెన్‌గా కనిపిస్తాడు.

“టీ 20 ప్రపంచ కప్ తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా కెప్టెన్సీకి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. అతను తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ తన నాయకత్వ బాధ్యతను రోహిత్‌తో పంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు” ఆ సంస్థ బీసీసీఐపై వ్యంగ్యంగా వార్తను ప్రచురించింది. అంతకుముందు, ఇన్‌సైడ్‌స్పోర్ట్.కో కూడా ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కోసం వన్డే, టీ 20 కెప్టెన్సీని విడిచిపెట్టవచ్చని నివేదించింది. ఇప్పుడు ఆ విషయాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తాజా నివేదిక ప్రకారం, కోహ్లీ, టీమ్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 65 టెస్టులు, 95 వన్డేలు, 45 టీ 20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో అతను 38 టెస్టులు గెలిచాడు. అలాగే 65 వన్డేలు, 29 టీ 20 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు.

వన్డేలు, టీ 20 ల్లో విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ అత్యుత్తమ పోటీదారుడిగా ఉన్నాడు. రోహిత్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కెప్టెన్సీగా వ్యవహరించి మ్యాచ్‌లు గెలిపించి జట్టును ఛాంపియన్‌గా మార్చిన అనుభవం ఉంది. అతను ముంబై ఇండియన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా చేశాడు. ఇప్పటివరకు 5 సీజన్లలో ఐపీఎల్ విజేతగా ముంబైను నిలిపాడు.

Also Read: CPL 2021: 9 భారీ సిక్సర్లతో ఐపీఎల్ ప్రత్యర్థులను హెచ్చరించిన రాజస్థాన్ ప్లేయర్.. కీలక ప్లేయర్ల లోటునే తీర్చేందుకు సిద్ధమైన కివీస్ కీపర్

ICC T20 World Cup 2021: ఐసీసీ ఈవెంట్లలో ధోనీ-శాస్త్రి-విరాట్ త్రయం విఫలం.. 8 ఏళ్లుగా భారత్‌కు అందని ద్రాక్షగానే ఐసీసీ టైటిల్..!

Neeraj Chopra: మమ్మల్ని చూసి ఎగతాళి చేశారు.. వ్యంగ్యంగా మాట్లాడారు.. కేబీసీ 13లో ఒలింపిక్ పతక విజేతల భావోద్వేగం.. ఈ షో ఎప్పుడంటే?

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా