Neeraj Chopra: మమ్మల్ని చూసి ఎగతాళి చేశారు.. వ్యంగ్యంగా మాట్లాడారు.. కేబీసీ 13లో ఒలింపిక్ పతక విజేతల భావోద్వేగం.. ఈ షో ఎప్పుడంటే?
ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, పీఆర్ శ్రీజేష్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే కేబీసీ షోలో కనిపించనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన కేబీసీ 13 ప్రోమోను సోనీ సంస్థ పంచుకుంది.
Neeraj Chopra: ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, పీఆర్ శ్రీజేష్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే కేబీసీ షోలో కనిపించనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన కేబీసీ 13 ప్రోమోను సోనీ సంస్థ పంచుకుంది. బిగ్ బీ ‘హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. టోక్యో ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, పీఆర్ శ్రీజేష్‌లు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ప్రముఖ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్ -13’ (KBC-13) రాబోయే ఎపిసోడ్‌లో ప్రత్యేక అతిథులుగా కనిపించబోతున్నారు. ఈ ‘ఫెంటాస్టిక్ ఫ్రైడే’ ఎపిసోడ్ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్, భారత హాకీ టీమ్ ప్లేయర్ శ్రీజేష్ రాకతో అమితాబ్ బచ్చన్ చాలా సంతోషంగా ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు.
బిగ్ బి ‘హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు సోషల్ మీడియాలో ఈ ప్రత్యేక ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వీడియోను పంచుకున్నారు. ‘టోక్యో ఒలింపిక్ పతక విజేతలు నీరజ్, శ్రీజేష్ తన పోరాటాలను మనం చూశాం. ఇక సెప్టెంబర్ 17 న రాత్రి 9 గంటలకు ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో వీరిద్దిర అనుభవాలను విందాం’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ వీడియోలో, అమితాబ్ బచ్చన్ పతక విజేతలిద్దరినీ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. దీనితో పాటు, బిగ్ బి ‘హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ప్రోమో వీడియోలో అమితాబ్ బచ్చన్ ఇద్దరు ఆటగాళ్లతో ‘నేను ఈ పతకాన్ని తాకవచ్చా?’ అంటూ అడగగానే.. శ్రీజేష్, నీరజ్‌లు ఇద్దరూ బిగ్ బీకి తమ పతకాలను అందిస్తారు. ఈ సమయంలో అమితాబ్ భావోద్వేగానికి గురయినట్లు చూడొచ్చు.
మమ్మల్ని చూసి ఎగతాళి చేశారు.. ఈ ఒలింపిక్స్‌తో అన్నీ మారిపోయాయని శ్రీజేష్ భావోద్వేగంగా చెబుతాడు. ‘మేము 2012 ఒలింపిక్స్‌కు అర్హత సాధించామని, కానీ అప్పుడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడంతో కొంతమంది వ్యక్తులు ఎగతాళి చేశారని తెలిపారు. భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, అందరూ మమ్మల్ని చూసి నవ్వడం ప్రారంభించారు. మేము ఎక్కడైనా వెళ్తే వ్యగ్యంగా మాట్లాడేవారు. ఇది చాలా అవమానకరమైనది. వాళ్ల ప్రవర్తనతో అసలు మేం ఎందుకు హాకీ ఆడుతున్నామో అని అనుకునేవాళ్లం. ప్రస్తుతం ఆ సమయం వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020 లో సాధించాం. పతకం వచ్చినప్పుడు, అలాంటి వాళ్లకు మంచి గుణపాఠాన్ని చెప్పామని అనుకున్నాం’ అంటూ వెల్లడించాడు. టోక్యో ఒలింపిక్స్ 2020 లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. అలాగే పీఆర్ శ్రీజేష్ కాంస్య పతకం గెలుచుకున్న భారత హాకీ జట్టులో భాగంగా ఉన్నాడు.
View this post on Instagram
Also Read: IPL 2021: శుభవార్త చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్.. భార్యతో కలిసి సీఎస్‌కే జెర్సీలో సందడి..!
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో భయంకరమైన ఓపెనర్లు వీరే.. టాప్ 5లో ఈ బ్యాట్స్‌మెన్‌ని చూసి షాకవుతారంతే?