- Telugu News Photo Gallery Cricket photos IPL 2021: Chennai Super Kings Player Krishnappa Gowtham expecting a baby with wife Archana Sundar in 2022
IPL 2021: శుభవార్త చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్.. భార్యతో కలిసి సీఎస్‌కే జెర్సీలో సందడి..!
Chennai Super Kings: ఐపీఎల్ రెండవ దశ (IPL 2021) కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు గత నెలలోనే యూఏఈకి చేరుకున్నారు. క్వారంటైన్ పూర్తయ్యాక ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.
Updated on: Sep 13, 2021 | 7:54 AM

ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ కె గౌతమ్ తన జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందబోతున్నాడు. కర్ణాటకకు చెందిన ఈ ఆటగాడు వచ్చే ఏడాది జనవరిలో తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు తన సంతోషాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాడు.

కె. గౌతమ్ భార్య అర్చన సుందర్‌తో ఒక ప్రత్యేక ఫోటోషూట్ ఫోటోలను పంచుకున్నారు. ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించి ఓఫొటోలో కనిపించారు. 'మా జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. జనవరి 2022 లో శిశువు రాక కోసం ఎదురుచూస్తున్నాం' అంటూ రాసుకొచ్చాడు.

గౌతమ్ తన భార్యతో యూఏఈలో ఉన్నాడు. చెన్నై బృందంతో కలిసి గత నెలలోనే అక్కడికి చేరుకున్నాడు. క్వారంటైన్ పూర్తి అయ్యాక జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు.

ఐపీఎల్ 2021 వేలంలో కె గౌతమ్ అత్యంత ఖరీదైన ఆటగాడి మారాడు. చెన్నై అతడిని రూ. 9.25 కోట్ల భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. అంతకుముందు అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడేవాడు. అయితే, చెన్నై కోసం మ్యాచ్ ఆడే అవకాశం అతనికి ఇంకా రాలేదు.

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచారు. ప్రస్తుతం సీఎస్‌కే రెండో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 19 న ముంబై ఇండియన్స్‌తో రెండో దశలో మొదటి మ్యాచ్ ఆడనుంది.




