Krithi Shetty: ‘5 స్టార్’ హీరోయిన్‌గా క్రితి శెట్టి… యస్.. ఇదో రేరెస్ట్ రికార్డ్!

Krithi Shetty: ఉప్పెన ఫేమ్ క్రిటిశెట్టి ఫైనల్‌గా ఉట్టి కొట్టేశారు. వైష్ణవ్‌ తేజ్ చెయ్యి పట్టుకుని... గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడమ్మాయిని... నెత్తినపెట్టుకుని చూసుకుంటోంది టాలీవుడ్ పరిశ్రమ.

Krithi Shetty: '5 స్టార్' హీరోయిన్‌గా క్రితి శెట్టి... యస్.. ఇదో రేరెస్ట్ రికార్డ్!
Krihti Shetty
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 13, 2021 | 12:13 PM

Krithi Shetty: ఉప్పెన ఫేమ్ క్రిటిశెట్టి ఫైనల్‌గా ఉట్టి కొట్టేశారు. వైష్ణవ్‌ తేజ్ చెయ్యి పట్టుకుని… గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడమ్మాయిని… నెత్తినపెట్టుకుని చూసుకుంటోంది టాలీవుడ్ పరిశ్రమ. గతంలో మరే హీరోయిన్ కీ దక్కని రేర్ అండ్ రేరెస్ట్ రికార్డ్ ఇప్పుడు క్రితి శెట్టి ఖాతాలో పడింది. ఒకేసారి ఏకంగా ఐదుగురు మెయిన్ స్ట్రీమ్ హీరోలతో సినిమాలు చేస్తున్న క్రితి… మినీ బుట్టబొమ్మ అనే పేరును ఖరారు చేసుకున్నారు.

ప్రస్తుతం ఈ గోల్డెన్ లెగ్ కిట్టీలో ఫైవ్ బిగ్ మూవీస్ వున్నాయి. నానీతో శ్యామ్‌సింగరాయ్, అక్కినేని కాంపౌండ్‌లో చైతూతో చేస్తున్న బంగార్రాజు, ఇంద్రగంటి మోహన్‌క్రిష్ణ డైరెక్షన్లో సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో లింగుసామి డైరెక్షన్‌లో మల్టిలింగువల్ మూవీ చేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఐదో హీరోను కూడా తన లైన్లోకి తెచ్చుకున్నారు.

Kriti Shetty

Kriti Shetty

నితిన్ హీరోగా వెరీ రీసెంట్ గా స్టార్ట్ అయిన పొలిటికల్ థ్రిల్లర్… ‘మాచర్ల నియోజకవర్గం’. రష్మిక, కీర్తి సురేష్ లాంటి టాప్ బ్రాస్ హీరోయిన్స్ తో సినిమాలు చేసే నితిన్… సడన్ గా ఈ ‘మాచర్ల’ కోసం క్రితి శెట్టి చెయ్యి పట్టుకున్నారు. దీంతో వైష్ణవ్ తో కలిపి క్రితి కలిసి నటించిన, నటిస్తున్న హీరోల సంఖ్య ఆరుకు చేరింది. చైతు, సుధీర్, నానీ, రామ్… ఇప్పుడు నితిన్ కూడా ఉప్పెన సెంటిమెంట్ ని చాలా సీరియస్ గా తీసుకున్నారన్న మాట.

ఇవ్వన్నీ ఒక ఎత్తయితే… ఐకాన్ స్టార్ గుడ్ లుక్స్ లో కూడా ఉన్నారట క్రితి శెట్టి. బన్నీ హీరోగా దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఐకాన్‌ మూవీలో క్రితి శెట్టి సెకండ్ ఫిమేల్ లీడ్ కి కన్సిడరేషన్లో వున్నారు. సో… టాలీవుడ్ స్టార్ డమ్ లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఈ బేబమ్మ చుట్టూనే తిరుగుతోందన్న మాట. ఆ అమ్మాయి మన సినిమాలో ఉంటే చాలు అనేంత గట్టిగా నాటుకుపోయిందట ఉప్పెన సెంటిమెంట్.

– శ్రీహరి రాజా, టీవీ9 తెలుగు, ET డెస్క్

Also Read..

లక్కీ ఛాన్స్ అందుకున్న యంగ్ హీరోయిన్.. పుష్ప మూవీలో వర్ష బొల్లమ్మ.. ఏ రోల్ అంటే..

ఆ బెంజ్ కారు లుక్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. చెర్రీ స్పెషల్ కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Love Story : మనసును తాకే అందమైన ప్రేమ కథ .. ఆకట్టుకుంటున్నశేఖర్ కమ్ముల’లవ్ స్టోరీ’ ట్రైలర్..