AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varsha Bollmma: లక్కీ ఛాన్స్ అందుకున్న యంగ్ హీరోయిన్.. పుష్ప మూవీలో వర్ష బొల్లమ్మ.. ఏ రోల్ అంటే..

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా గురించి ప్రేక్షకులు ఎప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Varsha Bollmma: లక్కీ ఛాన్స్ అందుకున్న యంగ్ హీరోయిన్.. పుష్ప మూవీలో వర్ష బొల్లమ్మ.. ఏ రోల్ అంటే..
Varsha
Rajitha Chanti
|

Updated on: Sep 13, 2021 | 11:49 AM

Share

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా గురించి ప్రేక్షకులు ఎప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించిన పోస్టర్స్, వీడియోలతో పుష్ప పై హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక సాంగ్ యూట్యూబ్‏లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తుండగా.. అందాల యాంకరమ్మ అనసూయ కీలకపాత్రలో నటిస్తోంది. ఇక బన్నీకి ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‏తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి.. ఎప్పటికప్పుడు లెటేస్ట్ అప్డేట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో పుష్పరాజ్ చెల్లెలి పాత్రలో యంగ్ హీరోయిన్ నటించనున్నట్లుగా సమాచారం. పుష్ప సినిమాలో బన్నీ చెల్లెలుకు సంబంధించిన సెంటిమెంట్ ఉంటుందని.. చెల్లెలి రోల్ సినిమాలో ప్రధాన భాగమని అంటున్నారు. ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‏ను ఎంపిక చేశారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ రోల్ కోసం వర్ష బొల్లమ్మను సెలక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. వర్ష తెలుగులో రెండు సినిమాలు చేసింది. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరోయిన్‏గా నటించింది. తాజాగా పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటి మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తైనట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతోంది. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూలు కాకినాడలో కొనసాగుతుంది. అలాగే ఈ మూవీని డిసెంబర్ 17న విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్.

Also Read: Uttej Wife Died: భార్య మరణం.. చిరు ముందు గుండెలవిసేలా రోధించిన ఉత్తేజ్… ప్రకాశ్ రాజ్ కంటతడి

Ram Charan: ఆ బెంజ్ కారు లుక్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. చెర్రీ స్పెషల్ కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..