AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttej Wife Died: భార్య మరణం.. చిరు ముందు గుండెలవిసేలా రోధించిన ఉత్తేజ్… ప్రకాశ్ రాజ్ కంటతడి

ప్రముఖ టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ భార్య అనారోగ్యంతో కన్నమూశారు. భార్య మరణంతో ఉత్తేజ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన దు:ఖిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టింది.

Uttej Wife Died: భార్య మరణం.. చిరు ముందు గుండెలవిసేలా రోధించిన ఉత్తేజ్... ప్రకాశ్ రాజ్ కంటతడి
Uttej Wife Death
Ram Naramaneni
| Edited By: Rajeev Rayala|

Updated on: Sep 13, 2021 | 12:45 PM

Share

ప్రముఖ టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కన్నుమూశారు. హైదరాబాద్‏లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 8.30 నిమిషాలకు ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో పడుతున్న ఆమెకు బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఉత్తేజ్ భార్య చనిపోయిన విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్‌తో పాటు పలువురు నటీనటులు.. ఆసుపత్రికి వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా భార్య మరణంతో ఉత్తేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మెగాస్టార్ ముందు గుండెలవిసేలా రోధించారు. మెగాస్టార్ సహా పలువురు నటులు ఉత్తేజ్ ఆయన కుమార్తెలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఉత్తేజ్ బాధ చూసి.. ప్రకాశ్ రాజ్ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉత్తేజ్ తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‎గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనలో మంచి ఎమోషనల్ రైటర్ కూడా ఉన్నారు. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసి.. ఆ తర్వాత నటుడిగా మారారు. మనీ మనీ, అంతం, రాత్రి, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, డేంజర్ వంటి సినిమాలకు మాటలు కూడా రాశారు ఉత్తేజ్. దాదాపు 200 చిత్రాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే.. ఉత్తేజ్ పలు సేవా కార్యక్రమాలు కూడా చేసేవారు. అందులో ఆయన భార్య పద్మవతి కూడా పాలు పంచుకునేది. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు. ఇక ఉత్తేజ్ భార్య పద్మవతి అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు మహా ప్రస్థానంలో నిర్వహించనున్నారు.

Also Read: స్మశానవాటికలో అస్థిపంజరంతో మహిళ నృత్యం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం

రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్