Sundeep Kishan’s Gully Rowdy: మెగాస్టార్ చేతుల మీదుగా సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ మూవీ ట్రైలర్

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం గల్లీ రౌడీ. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ఎలాగైనా హిట్ హిట్టాలన్న కసితో ఉన్నాడు

Sundeep Kishan's Gully Rowdy: మెగాస్టార్ చేతుల మీదుగా సందీప్ కిషన్ 'గల్లీ రౌడీ' మూవీ ట్రైలర్
Sandeep Kishan
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2021 | 12:07 PM

Sundeep Kishan: యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం గల్లీ రౌడీ. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ఎలాగైనా హిట్ హిట్టాలన్న కసితో ఉన్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు ఈ కుర్రహీరో. గల్లీ రౌడీ సినిమాకు జి నాగేశ్వర్ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సందీప్‌తోనే తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్ అనే సినిమా చేశాడు ఈ దర్శకుడు. ఇక గల్లీ రౌడీ సినిమాను ఎంవివి సత్యనారాయణ నిర్మించగా కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

గల్లీ రౌడీ ట్రైలర్‌‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్రైలర్‌ను లంచ్ చేసిన మెగాస్టార్.. చిత్రయూనిట్‌కు విషెష్ తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ.. గల్లీ రౌడీ టైటిల్ వెరైటీగా ఆసక్తికరంగా ఉంది. ఈ ట్రైలర్‌ని విడుదల చేయడం సంతోషం ఉందన్నారు. కోన రచయితగా సమర్పకుడిగా ఎంవీవీ నిర్మాతగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా  మంచి విజయం సాధిస్తుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మంచి కోసం రౌడీగా మారిన గల్లీ రౌడీ కథ ఆసక్తిని కలిగిస్తోంది. సందీప్ కిషన్ అండ్ టీమ్ కి విజయం అందాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్“ అని అన్నారు. ఇక మంచి కోసం రౌడీయిజం చేసే కుటుంబంలో పుట్టినప్పటికీ ఆతనికి అసలు రౌడీ గా మారడం ఇష్టం లేని వాడు.. అమ్మాయిని ప్రేమించి ప్రేమకోసం రౌడీగా ఎలా మారాడు? రౌడీగా మారడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన మేలేంటి? అన్నదే కథాంశం. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో సందీప్ కిషన్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు చూడాలి మరి ఏం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Uttej Wife Died: భార్య మరణం.. చిరు ముందు గుండెలవిసేలా రోధించిన ఉత్తేజ్… ప్రకాశ్ రాజ్ కంటతడి

Ram Charan: ఆ బెంజ్ కారు లుక్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. చెర్రీ స్పెషల్ కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Varsha Bollmma: లక్కీ ఛాన్స్ అందుకున్న యంగ్ హీరోయిన్.. పుష్ప మూవీలో వర్ష బొల్లమ్మ.. ఏ రోల్ అంటే..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?