AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: స్మశానవాటికలో అస్థిపంజరంతో మహిళ నృత్యం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం

స్మశానవాటిక పేరు వింటేనే ప్రతి ఒక్కరి మనస్సులో అలజడి రేగుతోంది. రాత్రి పూట పని ఉండి అటు వైపు వెళ్లాల్సి వచ్చినా, చాలామంది భయంతో...

Viral News: స్మశానవాటికలో అస్థిపంజరంతో మహిళ నృత్యం.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం
Nun Dances With Skeleton
Ram Naramaneni
|

Updated on: Sep 13, 2021 | 10:55 AM

Share

స్మశానవాటిక పేరు వింటేనే ప్రతి ఒక్కరి మనస్సులో అలజడి రేగుతోంది. రాత్రి పూట పని ఉండి అటు వైపు వెళ్లాల్సి వచ్చినా, చాలామంది భయంతో వణికిపోతారు. లేదంటే ఎవర్నైనా తోడు తీసుకెళ్తారు. అలాంటిది మీరు స్మశాన వాటిక గుండా వెళ్తున్నప్పుడు అస్థిపంజరంతో నృత్యం చేస్తున్న మహిళ  కనిపిస్తే, మీరు ఎలా ఫీల్ అవుతారు. గుండె ఆగిపోయినంత పని అవుతుంది కదూ. యుకెలోని హల్ సిటీలో యాజిటీజ్ అలాంటి దృశ్యమే కనిపించింది. ఇక్కడ బాటసారులు స్మశానవాటికలో సన్యాసిని నృత్యం చేయడం, అస్థిపంజరంతో ఆడుకోవడం చూసి ఖంగుతిన్నారు.

మీడియా నివేదికల ప్రకారం, ఈ వింత సంఘటనను స్మశానవాటిక సమీపంలో ప్రయాణిస్తున్న వ్యక్తి అతని కెమెరాలో బంధించారు. చిత్రంలో, సన్యాసిని వేషంలో ఉన్న ఒక మహిళ అస్థిపంజరం పక్కన నిలబడి ఉంది. ఆమె అస్థిపంజరంతో ఆడుకోవడం కూడా మీరు చూడవచ్చు. ఈ సంఘటన హల్ జనరల్ స్మశానవాటిక సమీపంలో జరిగింది. ఈ దృశ్యాన్ని చూడటానికి అక్కడ ప్రయాణిస్తున్న వాహనాలు కూడా కాసేపు ఆగిపోయాయి. ఆ సమయంలో, సన్యాసిని అస్థిపంజరాలతో ఆడుకోవడం, ఊగుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మహిళ సన్యాసిని వలె దుస్తులు ధరించింది. ఇది కాకుండా, తలపై కండువా కూడా ధరించింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు షాక్‌‌కు గురవుతున్నారు. ఆ మహిళకు మతి స్థిమితం ఉండకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఈ రాయిని కోస్తే రక్తం చిమ్ముతోంది.. అసలు విషయం తెలిస్తే షాక్ తింటారు

రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్