AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor: రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్

చిత్తూరులోని మురకంబట్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

Chittoor: రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్
Thieves
Ram Naramaneni
|

Updated on: Sep 12, 2021 | 7:19 PM

Share

ఒళ్లు వంచి పని చెయ్యలేరు. పెద్దగా చదువకున్న బాపతి కూడా కాదు.. కానీ ఈజీగా మనీ కావాలి. దీంతో యూట్యూబ్‌లో చూసి చోరీలు ఎలా చెయ్యాలో నేర్చుకున్నారు. ఈజీగా బైక్‌లు ఎలా చోరీ చెయ్యొచ్చో ట్రిక్ పట్టేశారు. ఇంకేముంది తమ పని షురూ చేశారు. సోలోగా బైక్ కనిపిస్తే.. దాన్ని మాయం చేసేస్తున్నారు. తాజాగా ఈ దొంగల బ్యాచ్‌ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  వారి వద్ద రూ.40లక్షల విలువైన 20 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పోలీసు గెస్ట్‌హౌస్‌లో శనివారం మీడియా సమావేశం నిర్వహించిన క్రైం సీఐ రమేష్‌ వివరాలను వెల్లడించారు. చిత్తూరులోని మురకంబట్టు వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులను ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

సరైన డాక్యుమెంట్స్ కూడా లేకపోవడంతో అనుమానించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బంగారుపాళ్యానికి చెందిన రాజేశ్, యాదమరి వాసి ఈశ్వర్‌గా గుర్తించారు. తిరుపతికి చెందిన రాజేశ్ అనే యువకుడితో కలిసి బైక్‌లను దొంగతనం చేస్తున్నట్టు నిర్ధారించారు. యూట్యూబ్‌ ద్వారా బైక్‌లు చోరీ చేసే విధానాన్ని తెలుసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని స్పష్టమైంది. తిరుపతి, రేణిగుంట, ఎం.ఆర్‌.పల్లి, అలిపిరి, చంద్రగిరి, ఐరాల, పలమనేరు, చిత్తూరు, కడపలోనూ దొంగతనాలకు పాల్పడిటనట్టు పోలీసులు తెలిపారు. రూ.3.90 లక్షల విలువైన కేటీఎం వాహనాన్ని రూ.40 వేలు, రూ.1.90 లక్షల విలువైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాన్ని రూ.35 వేలకు విక్రయించినట్లు వెల్లడించారు. చోరీ చేసిన వాహనాలను కొన్నింటిని విక్రయించగా మరికొన్నింటిని ఈశ్వర్‌కు చెందిన తోటలో దాచిపెట్టారు. ఈ బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Also Read:తన కంటే 12ఏళ్ల చిన్నోడితో మహిళ అఫైర్… ఫైనల్‌గా ఊహించని విషాదాంతం

ప్రకాష్ రాజ్ విందు రాజకీయం పై బండ్లగణేష్ సంచలన వ్యాఖ్యలు.. మా ప్రాణాలతో చెలగాటమడోద్దు అంటూ..