Viral Video: పాపం ఆడపిల్ల అని లిఫ్ట్ ఇచ్చాడు.. తర్వాత ఏమైందంటే..?? వీడియో
మీరు బైక్‌పైన వెళ్తున్నప్పుడు ఎవరెవరో లిఫ్ట్ అడుగుతుంటారు.. అయ్యో పాపం అనుకుని లిఫ్ట్ ఇచ్చారో.. మీ పని అంతే.. ఇదిగో ఇక్కడ ఓ పాతికేళ్ల అమ్మాయి రోడ్డు పక్కన నిల్చుని అటుగా బైక్‌పై వెళ్తున్నవారిని లిఫ్ట్ అడుగుతుంది.
మీరు బైక్‌పైన వెళ్తున్నప్పుడు ఎవరెవరో లిఫ్ట్ అడుగుతుంటారు.. అయ్యో పాపం అనుకుని లిఫ్ట్ ఇచ్చారో.. మీ పని అంతే.. ఇదిగో ఇక్కడ ఓ పాతికేళ్ల అమ్మాయి రోడ్డు పక్కన నిల్చుని అటుగా బైక్‌పై వెళ్తున్నవారిని లిఫ్ట్ అడుగుతుంది. ఎట్టకేలకు ఓ వ్యక్తి .. ఆడపిల్ల.. ఒంటరిగా ఉంది.. పాపం అనుకుని లిఫ్ట్ ఇచ్చాడు. ఇక్కడవరకు అంతా బాగానే ఉంది. కొద్ది దూరం వెళ్లాక తాను దిగాల్సిన ప్లేస్ ఇదే అంటూ బైక్ ఆపింది. అక్కడ దిగిన వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి మెడలో ఉన్న బంగారు చైన్ లాక్కోని పరారయ్యింది. ఆ చైన్ దాదాపు మూడున్నర తులాలు ఉంటుంది. ఖంగుతిన్న బాధితుడు కేకలు పెడుతూ గట్టిగా అరిచాడు. దీంతో ఆ పక్కన ఉన్న స్థానికులు యువతిని పట్టుకున్నారు. అతని బంగారాన్ని అతనికి ఇప్పించారు. ఈ ఘటన విజయనగరం జిల్లా గజపతినగరంలో జరిగింది
మరిన్ని ఇక్కడ చూడండి: ఈ పాప ఐక్యూ లెవెల్స్ ఐన్‌స్టీన్, హాకింగ్ కంటె ఎక్కువ..!! ఎనిమిదేళ్ళకే రెండు డిగ్రీలు సాధించింది.. వీడియో