AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBK 107 Movie : బాలయ్యలో రౌడీయిజాన్ని బయటకు తీయనున్నాడట.. గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ ఇదేనా..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు వచ్చేసింది.

NBK 107 Movie : బాలయ్యలో రౌడీయిజాన్ని బయటకు తీయనున్నాడట.. గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ ఇదేనా..
Nbk
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2021 | 1:04 PM

Share

NBK 107 Movie : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు వచ్చేసింది. ఇప్పటికే బాలయ్యను సింహగా, లెజెండ్‌గా చూపించిన బోయపాటి ఇప్పుడు అఖండగా మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు అభిమానుల్లో అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇక బోయపాటి సినిమాలో యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా రోమాలు నిక్కపొడుచుకునే ఫైట్స్ ఉండనున్నాయని టీజర్స్‌తోనే చెప్పేశారు బోయపాటి. అఖండ సినిమాను సంక్రాంతి బరిలో దించేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా కథను బాలకృష్ణ వినిపించడం.. ఆయన ఓకే చేయడం అంతా అయిపోయాయి.

ఇక గోపీచంద్ – బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఇటీవలే క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న గోపిచంద్.. ఇప్పుడు బాలయ్య కోసం ఎలాంటి కథను ఎంచుకున్నాడు..? ఆయన ఎలా కనిపించబోతున్నాడు..? అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. అయితే బాలయ్యను పోలీస్‌గా చూపించబోతున్నాడని కొందరు.. లేదు ఫ్యాక్షనిస్ట్‌గా చూపిస్తాడని మరి కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఎక్కువశాతం బాలయ్యలోని రౌడీయిజాన్ని బయటకు తీసుకురావడానికి గోపీచంద్ ట్రై చేస్తున్నారట. టైటిల్ కూడా `రౌడీయిజం`అని అనుకుంటున్నారట. ఈ సినిమాలో మాస్ అభిమానులకు కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్.. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో బాలయ్య మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

లక్కీ ఛాన్స్ అందుకున్న యంగ్ హీరోయిన్.. పుష్ప మూవీలో వర్ష బొల్లమ్మ.. ఏ రోల్ అంటే..

ఆ బెంజ్ కారు లుక్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. చెర్రీ స్పెషల్ కార్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Love Story : మనసును తాకే అందమైన ప్రేమ కథ .. ఆకట్టుకుంటున్నశేఖర్ కమ్ముల’లవ్ స్టోరీ’ ట్రైలర్..

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి