Viral Video: ఫుట్‌బాల్ ఆడుతూ ఎలుగుబంట్ల చిందులు.. ప్లేయర్స్‌ను మించిపోయాయిగా.. వైరల్ వీడియో..
జంతువులు కూడా కొన్ని సందర్భాల్లో మనుషుల మాదిరిగా ప్రవర్తిస్తుంటాయన్న సంగతి సంగతి తెలిసిందే. ఇక కొన్నిసార్లు ఆడే ఆటలు
జంతువులు కూడా కొన్ని సందర్భాల్లో మనుషుల మాదిరిగా ప్రవర్తిస్తుంటాయన్న సంగతి సంగతి తెలిసిందే. ఇక కొన్నిసార్లు ఆడే ఆటలు ఎంతో ముచ్చటగా అనిపిస్తాయి. ఇటీవల జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో భయానక వీడియోలతోపాటు.. ఫన్నీ వీడియోలు సైతం అనేకం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవల జంతువులు, పక్షుల వీడియోలను చూడటానికి జనాలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇలాంటి వీడియోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తాజాగా రెండు ఎలుగుబంట్లు అచ్చం మనుషుల మాదిరిగానే ఫుట్ బాల్ ఆడుతున్నాయి. వీటి దగ్గర మనుషులు కూడా ఉండి.. వాటితో ఫుట్ బాల్ ఆడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ఒడిశాలో రెండు ఎలుగు బంట్లు ఫుట్‌బాల్ ఆడాయి. నాబరంగ్‌పూర్ జిల్లాలోని సుకీగావ్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులు ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో అక్కడకు ఆకస్మాత్తుగా రెండు ఎలుగు బంట్లు వచ్చాయి. అయితే వాటిని చూసిన యువకులు వెంటనే అక్కడి నుంచి పరుగుతీశారు. మైదానంలోనే ఫుట్‌బాల్‌ను వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. అయితే ఆ బంతిని తీసుకున్న ఎలుగు బంట్లు కాసేపు దానితో ఫుట్ బాల్ ఆడాయి. కిందకు పైకి విసిరివేస్తూ.. ఫుట్‌బాల్ స్కిల్స్ ప్రదర్శించాయి. మనుషుల్లాగే అవీ తమ ట్యాలెంట్‌ను చూపించాయి. స్మార్ట్ యానిమల్స్ రీతిలో ఆ ఎలుగు బంట్లు హంగామా చేశాయి. అవి ఫుట్‌బాల్ ఆడుతున్న దృశ్యాలను గ్రామ యువకులు భయం భయంగానే తమ సెల్‌ఫోన్లలో బంధించారు. కొందరు వీడియోలు, కొందరు ఫోటోలు తీశారు. ఎప్పుడూ ఊరి బయట కనిపించే ఎలుగు బంట్లు ఈసారి పిల్లలు ఆడే ఫుట్‌బాల్‌ను తీసుకుని అడవికిలోకి వెళ్లినట్లుగా అక్కడి వారు తెలిపారు.
ట్వీట్..
#WATCH | Two wild bears were seen playing football at Sukigaon in Umarkot area of Nabarangpur district, Odisha
“It is an animal instinct. They examine & try to find out the nature of any object that they find for the first time,” the DFO said on Monday.
(Video: Forest Dept) pic.twitter.com/c2YnVZqg7j
— ANI (@ANI) September 14, 2021