Bigg Boss 5 Telugu: ఇక్కడ దగడ్ లోబో.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన కంటెస్టెంట్.. సపోర్ట్ చేస్తే నామం పెడుతున్నారంటూ..

బిగ్‏బాస్ సీజన్ 5.. రెండో వారం నామినేషన్ నిన్న సోమవారం రసవత్తరంగా జరిగింది. వార్నింగ్స్, గొడవలు, ఏడుపులతో నిన్నటి ఎపిసోడ్ హీటెక్కింది.

Bigg Boss 5 Telugu: ఇక్కడ దగడ్ లోబో.. ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన కంటెస్టెంట్.. సపోర్ట్ చేస్తే నామం పెడుతున్నారంటూ..
Lobo
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2021 | 7:41 AM

బిగ్‏బాస్ సీజన్ 5.. రెండో వారం నామినేషన్ నిన్న సోమవారం రసవత్తరంగా జరిగింది. వార్నింగ్స్, గొడవలు, ఏడుపులతో నిన్నటి ఎపిసోడ్ హీటెక్కింది. ఇక ఎప్పటిలాగే ఫిట్టింగులు పెట్టె బిగ్‏బాస్.. ఈసారి కంటెస్టెంట్స్‏లను రెండు గ్రూపుల విడగొట్టి.. వారి మధ్య గొడవలకు ఆధ్యం పోసాడు. నక్క, గ్రద్ద టీం అంటూ సభ్యులను రెండు గ్రూపులుగా చేసి.. ఒక కంటెస్టెంట్ తమ అపోజిట్ గ్రూపులో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్‏ను నామినేట్ చేస్తూ… ముఖంపై రంగు పూయాలని చెప్పాడు. ఇక నక్క టీంలో ఉమా, లహరి, మానస్, జెస్సీ, రవి, సన్నీ, శ్వేత, నటరాజ్, కాజల్ ఉన్నారు. ఇక గ్రద్ద టీంలో లోబో, విశ్వ, యానీ, శ్రీరాం, ప్రియ, హమీద, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలు ఉన్నారు. అయితే ఇక్కడే అసలైన రచ్చ మొదలైంది. నామినేట్ చేయడానికంటే ముందు కంటెస్టెంట్స్ తమ నోటికి పని చెప్పారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇక మరికొందరు సభ్యులు మాత్రం సహనం కోల్పోయి.. ఇతరులపై దాడికి దిగినంత పనిచేశారు.

ఇక వరుసగా.. సిరి… ఉమా, నటరాజ్‌లను.. నటరాజ్ మాస్టర్.. ప్రియ, ప్రియాంక, యానీ మాస్టార్.. ఉమా, కాజల్, సన్నీ.. ప్రియ, ప్రియాంక, ప్రియాంక సింగ్.. నటరాజ్, సన్నీలను, లోబో.. శ్వేతా వర్మ, రవి, శ్వేతా వర్మ.. లోబో, హమీద షన్ను.. ఉమ, జెస్సీ , కాజల్.. యానీ, విశ్వ, ప్రియ.. సన్నీ, నటరాజ్, జెస్సీ.. శ్రీరామచంద్ర, లోబో, శ్రీరామచంద్ర.. నటరాజ్, కాజల్, యాంకర్ రవి.. ప్రియాంక, శ్రీరామచంద్రలను నామినేట్ చేశారు. అయితే ఇక్కడ లోబో, మానస్ మధ్య మరోసారి గొడవ జరిగింది. మానస్ వచ్చి.. తాను కెప్టెన్సీ కాకుండా అడ్డుకున్నందుకు లోబోను నామినేట్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. దీంతో లోబో రెచ్చిపోయాడు. లోబో నాటే నేమ్.. ఇట్స్ ఏ బ్రాండ్, పెద్ద పెద్ద హీరోలు నన్వు గుర్తుపడతారు అంటూ తనకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. సపోర్ట్ చేయాలని పోతే తనకే నామం పెడుతున్నారని అసహనానికి లోనయ్యాడు. మరి ఇదే మాట గతంలో ప్రస్తావించినప్పుడు ఎందుకు చెప్పలేని మానస్ అడగ్గా.. మీరు హీరో కదా.. విననీకి రెడీ లేరు.. నా ముందు యాటిట్యూడ్ చూపిస్తున్నావ్.. కానీ నా ముందు చిన్నపిల్లోడివి అంటూ ఆవేశపడిపోయాడు. ఆ తర్వాత మానస్.. ప్రియకు రంగు పూసి నామినేట్ చేశాడు.

Also Read: Bigg Boss 5 Telugu: వారిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఆ కంటెస్టెంట్స్‏పై శ్వేత ఉగ్రరూపం..

Bigg Bigg 5 Telugu: వామ్మో.. ఇదేక్కడి గోల రా బాబు.. నామినేట్ చేయమంటే నోటికి పని చెప్పారు… బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్..

ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా