Bigg Bigg 5 Telugu: వామ్మో.. ఇదేక్కడి గోల రా బాబు.. నామినేట్ చేయమంటే నోటికి పని చెప్పారు… బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్..

బిగ్‏బాస్ సీజన్ 5 గత షోలకు భిన్నంగా సాగుతుందనే చెప్పుకోవాలి.. ప్రారంభమైన రెండో రోజు నుంచే ఇంట్లో రచ్చ షురు చేశారు కంటెస్టెంట్స్.

Bigg Bigg 5 Telugu: వామ్మో.. ఇదేక్కడి గోల రా బాబు.. నామినేట్ చేయమంటే నోటికి పని చెప్పారు... బూతులతో రెచ్చిపోయిన కంటెస్టెంట్..
Bigg Boss
Follow us

|

Updated on: Sep 14, 2021 | 6:39 AM

బిగ్‏బాస్ సీజన్ 5 గత షోలకు భిన్నంగా సాగుతుందనే చెప్పుకోవాలి.. ప్రారంభమైన రెండో రోజు నుంచే ఇంట్లో రచ్చ షురు చేశారు కంటెస్టెంట్స్. మొదటి నుంచి గొడవలు, డ్రామాలతో ఫిట్టింగ్‍లు పెట్టే బిగ్‏బాస్‏కే పనిలేకుండా చేస్తున్నారు. ఇక మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటగా సరయు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియ సోమవారం రసవత్తరంగా జరిగింది. నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్‏బాస్ సభ్యులను రెండు టీంలుగా విడగొట్టారు. నక్క, గ్రద్ద అంటూ రెండు టీంలుగా విభజించగా.. నక్క టీంలో ఉమా, లహరి, మానస్, జెస్సీ, రవి, సన్నీ, శ్వేత, నటరాజ్, కాజల్ ఉన్నారు. ఇక గ్రద్ద టీంలో లోబో, విశ్వ, యానీ, శ్రీరాం, ప్రియ, హమీద, సిరి, షణ్ముఖ్, ప్రియాంకలు ఉన్నారు. ఇక ఒక టీంలోని సభ్యుడు ఇతర టీంలోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు.

మొదటగా సిరి… ఉమా, నటరాజ్‏లను నామినేట్ చేసింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్.. ప్రియ, ప్రియాంకలను.. యానీ మాస్టర్… ఉమా, కాజల్‏లను, సన్నీ.. ప్రియ, ప్రియాంక.. ప్రియాంక సింగ్.. నటరాజ్, సన్నీలను నామినేట్ చేసింది. ఇక మానస్.. లోబో, ప్రియాలను నామినేట్ చేస్తూ.. లోబో తనకు సాయం చేయలేదని.. ప్రియ సరిగ్గా మాట్లాడటం లేదని చెప్పాడు. ఇక అసలైన రచ్చ విశ్వ నామినేట్ ప్రక్రియతో మొదలైంది. విశ్వ వచ్చి ఉమా, కాజల్‏ను నామినేట్ చేశాడు. మళ్లీ పాత గొడవలను తవ్వి తీశాడు. నాగార్జున ఇచ్చి ఆలు కర్రీని ఇంట్లో వాళ్లకి ఇవ్వలేదని ఉమాను నామినేట్ చేశాడు. దీంతో ఉమా స్పందిస్తూ.. నాగార్జున తనను మాత్రమే తినాలన్నాడని.. అందుకే ఎవరికి ఇవ్వలేదని చెబుతూ దారుణమైన కామెంట్స్ చేసింది. దీంతో ఇంట్లో ఉన్నవాళ్లంతా షాక్ అయ్యారు. షన్ను అయితే నోరెళ్లబెట్టాడు. ఇక ప్రియాంక సింగ్ అయితే కింద పడి మరీ నవ్వేసింది. ఇక ఆ తర్వాత ఉమా..నామినేట్ చేసేందుకు వచ్చి మరోసారి రెచ్చిపోయింది. యానీ మాస్టర్, విశ్వలను నామినేట్ చేస్తూ.. నోటికి పని చెప్పింది.. దారుణమైన బూతులు మాట్లాడుతూ.. ఇంట్లో రచ్చ చేసింది. మొత్తానికి రెండో వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది.

Also Read: MAA Elections 2021: రసవత్తరంగా మా ఎన్నికలు.. ఊపందుకున్న విందు రాజకీయాలు.. మంచు విష్ణు ఆధ్వర్యంలో..

Bigg Boss 5 Telugu 2nd week nomination list: ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్లు.. హౌస్ నుంచి వెళ్లేది ఆమేనా..?

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..