AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వైసీపీ నేతలకు భూమా బ్రహ్మానందరెడ్డి స్వీట్ వార్నింగ్.. ఏ విషయంలోనంటే..

Andhra Pradesh: నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తన దైనశైలిలో స్దానిక వైసిపి నాయకుల పై ఫైర్ అయ్యారు.రెండు రోజల వ్యవదిలో ఇద్దరు కార్యకర్తల

Andhra Pradesh: వైసీపీ నేతలకు భూమా బ్రహ్మానందరెడ్డి స్వీట్ వార్నింగ్.. ఏ విషయంలోనంటే..
Bhuma
Shiva Prajapati
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 14, 2021 | 3:50 PM

Share

Andhra Pradesh: నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తన దైనశైలిలో స్దానిక వైసిపి నాయకులపై ఫైర్ అయ్యారు. రెండు రోజల వ్యవధిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై 42వ వార్డు వైసీపీ నాయకుడు దాడులకు తెగబడటంపై తీవ్రంగా స్పందించారు. వైసీపీ నాయకుల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, దాడులుకు పాల్పడితే ఇక్కడ బయపడే వారేవ్వరు లేరంటూ తీవ్ర స్వరంతో అగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు పర్సనల్ గా తీసుకొని దాడులు చేస్తే.. తాము కూడా అలాగే పర్సనల్ తీసుకొని దాడులు చేయ్యాల్సి వస్తుందంటూ తనదైన స్డైల్‌లో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ఇలా దాడులకు పాల్పడలేదంటు గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచే బదులు.. అభివృద్ధి చేయడంపై దృష్టి పెడితే బాగుంటుందని హితవుపలికారు.

కాగా, సోమవారం రాత్రి స్థానిక 42వ వార్డులో గణేష్ ఉత్సవాల్లో అదే వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తపై వార్డు కౌన్సిలర్ భర్త కిరణ్, మహేష్, వినోద్ తదితరులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మణి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, కౌన్సిలర్ ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ ‌చేసినందుకు గానూ కక్ష కట్టి దాడికి పాల్పడ్డారని బాదితుడు వాపోయాడు. గాయపడిన మణి కుమార్‌ను మాజీ ఎమ్మెల్యే ‌భూమా బ్రహ్మానందరెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. స్థానిక వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దాడులకు పాల్పడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Also read:

Weight Loss Tips: ఈ మూడు సూత్రాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు..

ICC Player Of Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌గా ఇంగ్లండ్ కెప్టెన్‌.. కలిసొచ్చిన టీమిండియా సిరీస్

Farmer Protest: నిరసనలు.. ఆందోళనలు ఇక్కడ వద్దు.. ఢిల్లీ సరిహద్దుల్లో చేసుకోండి.. రైతులకు పంజాబ్‌ సిఎం అమరీందర్ విజ్ఞప్తి..