Farmer Protest: నిరసనలు.. ఆందోళనలు ఇక్కడ వద్దు.. ఢిల్లీ సరిహద్దుల్లో చేసుకోండి.. రైతులకు పంజాబ్‌ సిఎం అమరీందర్ విజ్ఞప్తి..

రైతు ఆందోళనకారులకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక సూచన చేశారు. ఆందోళనలు, నిరసలు పంజాబ్ సరిహద్దులో కాకుండా ఢిల్లీ సరిహద్దులో చేసుకోవాలని సూచించారు. 

Farmer Protest: నిరసనలు.. ఆందోళనలు ఇక్కడ వద్దు.. ఢిల్లీ సరిహద్దుల్లో చేసుకోండి.. రైతులకు పంజాబ్‌ సిఎం అమరీందర్ విజ్ఞప్తి..
Amarinder Singh
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:50 PM

రైతు ఆందోళనకారులకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక సూచన చేశారు. ఆందోళనలు, నిరసలు పంజాబ్ సరిహద్దులో కాకుండా ఢిల్లీ సరిహద్దులో చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై తెలిపే నిరసను ఢిల్లీ సరిహద్దుల్లోనే కొనసాగితే బాగుంటుందని, పంజాబ్‌లో నిరసన చేసేవాళ్లు ఢిల్లీకి వెళ్లాలని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. రైతుల నిరసన వల్ల రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పంజాబ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు.

పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇది మీ పంజాబ్.. మీ గ్రామాలు.. మీ ప్రజలు అని నేను రైతు సోదరులకు గుర్తు చేస్తున్నాను. ఢిల్లీ సరిహద్దుల్లో మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి. వారిపై ఒత్తిడి తెచ్చి వారిని ఒప్పించుకోండి. పంజాబ్‌లో కూడా రైతులు 113 చోట్ల నిరసనల్లో పాల్గొన్నారు? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? పంజాబ్ ఆర్థికంగా నష్టపోతుంది. వారు (ఇతర రైతులు) ఢిల్లీ (సరిహద్దులు) హర్యానాలలో చేస్తున్నారు. మీరు అక్కడ కూడా చేయండి. అంటూ పంజాబ్ రైతులను కోరారు.

రైతులు తన అభ్యర్థనను అంగీకరిస్తారని సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖియానా గ్రామంలో రూ .13.44 కోట్ల ప్రభుత్వ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి.. ఈ కామెంట్స్ చేశారు. పంజాబ్‌కు అభివృద్ధి అవసరమని అన్నారు. సింగ్ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.

హర్యానా హోం మంత్రి సింగ్ ప్రకటనను…

బాదల్ కుటుంబం మొదట వ్యవసాయ ఆర్డినెన్స్‌లకు మద్దతిచ్చింది. ఆ తర్వాత రైతుల కోపాన్ని ఎదుర్కొన్న తర్వాత ఈ సమస్యపై యూ టర్న్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి బాదల్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. పంజాబ్ ముఖ్యమంత్రి రైతులకు చేసిన విజ్ఞప్తిపై స్పందించిన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఇది “బాధ్యతారహితమైన” ప్రకటన అని అన్నారు. సింగ్ రైతులను ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు.

విజ్ ట్వీట్ చేస్తూ ‘పంజాబ్ ముఖ్యమంత్రి మీకు ఏమి చేయాలనుకున్నారో అది పంజాబ్‌లో కాకుండా హర్యానా లేదా ఢిల్లీ సరిహద్దుల్లో చేయండి అంటూ సెటైర్లు సందించాడు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్  చేసిన ప్రకటన చాలా బాధ్యతారాహిత్యం అంటూ వ్యాఖ్యానించాడు. రైతులను ప్రేరేపించే పనిని అమరీందర్ సింగ్ చేశారని ఇది రుజువు చేసిందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: Business Plan: భారతీయ రైల్వేలో వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే సంపాదన.. ఎలా చేయాలంటే..