Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Coronavirus: దేశాన్ని వీడుతున్న కోవిడ్ మేఘాలు.. రోజు రోజుకు తగ్గుతున్న కేసులు.. ఆ రాష్ట్రంలో మాత్రం..

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో...

India Coronavirus: దేశాన్ని వీడుతున్న కోవిడ్ మేఘాలు.. రోజు రోజుకు తగ్గుతున్న కేసులు.. ఆ రాష్ట్రంలో మాత్రం..
Corona
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:53 PM

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో మంగళవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 25,404 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 339 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇదిలావుంటే కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 15,058 కరోనా కేసులు నమోదు కాగా.. 99 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80 శాతానికి పైగా కరోనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,32,89,579 కి పెరగగా.. మరణాల సంఖ్య4,43,213 చేరింది. నిన్న కరోనా నుంచి 34,848 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,24,84,159 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,62,207 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,22,38,324 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో78,66,950 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 38,746 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 864 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 20,30,849 మంది కరోనా వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి బారినపడి 12 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 14,010కి చేరింది.

ఇక, ఒక్కరోజు వ్యవధిలో 1,310 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,02,187 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,652 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,73,63,641 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియనే వేగవంతం చేసింది ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లిన చో తప్పక మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Business Plan: భారతీయ రైల్వేలో వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే సంపాదన.. ఎలా చేయాలంటే..