Fixed Deposits: మీరు ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారా..? తాజాగా సవరించిన వడ్డీ రేట్ల వివరాలు..!

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై చాలా మంది మొగ్గు చూపుతుంటారు. ఈ పెట్టుబడులపై మంచి ఆదాయం వస్తుంటుంది. అందుకే ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్స్‌..

Fixed Deposits: మీరు ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారా..? తాజాగా సవరించిన వడ్డీ రేట్ల వివరాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 14, 2021 | 11:39 AM

Fixed Deposits: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై చాలా మంది మొగ్గు చూపుతుంటారు. ఈ పెట్టుబడులపై మంచి ఆదాయం వస్తుంటుంది. అందుకే ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతుంటారు. వీరిని ఆకర్షించేందుకు బ్యాంకులు కూడా ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సాధారణ కస్టమర్ల కంటే సీనియర్​ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఆఫర్​చేస్తోంది. సెప్టెంబర్ 8 నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తీసుకువచ్చింది. కోటక్​ మహీంద్రా బ్యాంక్​ తాజా ఎఫ్​డీ వడ్డీ రేట్లను పరిశీలిస్తే..

కోటక్​ మహీంద్రా బ్యాంకు కస్టమర్ల నుంచి రూ .2 కోట్ల వరకు డిపాజిట్లను స్వీకరిస్తోంది. తాజాగా సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. 7 నుంచి 30 రోజుల వరకు మెచూరిటీ గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 2.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 31 నుంచి 90 రోజుల్లో మెచూరిటీ అవుతున్న డిపాజిట్లపై 2.75 శాతం, 91-120 రోజుల వ్యవధి గల ఎఫ్​డీపై 3 శాతం, 121-179 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 3.25 శాతం వడ్డీ రేట్లను అమలు చేస్తోంది. 180-269 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.25 శాతం, 270- 364 రోజుల ఎఫ్​డీపై 4.4 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక 365- 389 రోజుల వరకు 4.5 శాతం, 390 రోజుల నుంచి 23 నెలల ఎఫ్​డీపై 4.75 శాతం వడ్డీ రేటు అమలు చేస్తోంది.

సీనియర్​ సిటిజన్లకు..

సీనియర్ సిటిజన్లకు, కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ అందజేస్తుంది. 7- 14 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ అందజేస్తుంది. 180 రోజుల మెచూరిటీ గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ రేట్లను అమలు చేస్తుంది. అలాగే 364 రోజుల ఫిక్స్‌డ్‌ ​ డిపాజిట్‌పై 4.9 శాతం, 23 నెలల నుంచి 2 సంవత్సరాల మెచూరిటీ గల డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధి గల డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ అమలు చేస్తోంది. అయితే ఈ బ్యాంకే కాకుండా ఇతర బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ విధమైన వడ్డీ రేట్ల ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన వారు మంచి ఆదాయం పొందవచ్చు.

ఇవీ కూడా చదవండి:BMW X5 SportX Plus: కార్లు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. కొత్త వేరియంట్లలో బీఎండబ్ల్యూ ఎక్స్‌5

SBI Special Deposit Scheme: ఎస్‌బీఐ కస్టమర్లు అలర్ట్‌.. నేడే చివరి అవకాశం.. పూర్తి వివరాలు..!

Car Offers: కొత్త కారు కొనేవారికి బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.2.50 లక్షలకుపైగా వరకు తగ్గింపు..!