Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో గుంటనక్క ఎవరో సన్నీకి క్లారిటీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్..!

బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే 19మంది కంటెస్టెంట్స్‌లో ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో గుంటనక్క ఎవరో సన్నీకి క్లారిటీ ఇచ్చిన నటరాజ్ మాస్టర్..!
Bigg Boss
Follow us

|

Updated on: Sep 15, 2021 | 6:39 AM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే 19మంది కంటెస్టెంట్స్‌లో ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక ప్రతి సీజన్‌లానే ఈ సీజన్‌లో కూడా గొడవలు, ఏడుపులు, అల్లర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో మరింత రంజుగా సాగింది. నటరాజ్ మాస్టర్‌కు రవికి మధ్య ఫైట్ నడిచింది. నటరాజ్ మాస్టర్ గుంట‌నక్క అని అనడంతో రవి సీరియస్ అయ్యాడు. ఇక రవి మాట్లాడుతూ.. ‘ఎందుకు అంతా అలా ఊహించుకుంటున్నారు మాస్టర్?’ అని అంటాడు.

దానికి నటరాజ్ మాస్టర్ స్పందిస్తూ…’నేనేం ఊహించుకోవడం లేదు.. నామినేషన్ ఓట్లు ఎలా పడ్డాయో నాకు తెలుసు..’ అంటాడు . వెంటనే అందుకున్న రవి ‘మీరు దేవుడిలా మాట్లాడితే.. ఇంకేం చెయ్యాలి మాస్టర్.. మీరు దేవుడు.. మీరు తోపు, తురుము నాకు తెలుసు.. ప్రూఫ్ ఉంది కదా మీకు… నేనే ఎక్కిస్తున్నాను అని? నాతో చక్కగా మాట్లాడరెందుకు మాస్టర్..? అంటూవాదనకు దిగాడు రవి. ఆ తర్వాత సన్నీ నటరాజ్ మాస్టర్ దగ్గరకు వెళ్లి.. మీరన్న గుంటనక్క ఒక్కరే అని అర్థమైంది కానీ.. ఎవరు? ఎవరిని అన్నారు?’ అంటూ క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నిస్తాడు.

అదే టైమ్ లో బిగ్ బాస్ స్కీన్ మీద రవిని చూపించగా.. మీకు వచ్చేసిందిగా క్లారిటీ అంటాడు నటరాజ్ మాస్టర్. ‘ఓరిడమ్మ ఇప్పుడు వచ్చింది..’ అని నవ్వుతాడు.  ఆతర్వాత నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘గుమ్మడికాయల దొంగ అనగానే.. భుజాలు తడుముకోవడం తెలుసుకదా.. నామినేషన్ అంటేఏంటీ ? దానిలో కూడా ఫేక్ హగ్గులు, ఫేక్ మాటలు నాకు నచ్చదు.. అందుకే ఆ టైమ్‌లో సైలెంట్ గా ఉన్నాను..’ అని నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇచ్చిపడేసిన శ్వేత వర్మ | ఉమ అత్త నోట బూతులు.. : Bigg Boss 5 Telugu Updates Video.

Viral Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు బిగ్‏బాస్ ఇంట్లో ఫైర్ బ్రాండ్.. ఎవరో గుర్తుపట్టండి..

Big Boss Season 5: బాలయ్య నరసింహనాయుడులో బాలనటుడిగా నటించిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. పవన్ వీరాభిమాని ఎవరో మీకు తెలుసా