ఆచార్య రిలీజ్‌ డేట్ ఫిక్స్‌.. తొందర్లో గ్రాండ్‌ రిలీజ్‌..!(వీడియో): Acharya movie Video.

పాఠాలు చెప్పే అలవాటు లేకపోయిన.. గుణపాఠాలు చెబుతాడని అందరూ ఆయన్ని ఆచార్య అంటారు. అందుకనే ఆయన కోసం.. ఎంతగానో నిరీక్షిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెర పడే సమయం ఆసన్నమైందని అంటున్నారు ఈ మూవీ మేకర్స్‌.

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీని ఫినిష్ చేశారు చిరు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్దా పాత్రలో నటిస్తుండగా.. కాజల్ హీరోయిన్‏గా.. పూజా హెగ్డే కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. గతంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేడ్ ఒకటి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే గతంలో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మేకర్స్… దీపావళికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావాలనుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అలాగే ఇందులో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడంతో.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరిన్ని చదవండి ఇక్కడ : Saidabad Horror : నిందితుని కోసం రంగంలోకి టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. 100కి పైగా పోలీసులు…

 మృగాడ్ని పట్టుకుంటే రూ .10 లక్షల రివార్డు.. క్రిమినల్ కోసం వేట మొదలెట్టిన పోలీస్..(వీడియో).: Hyderabad cops

 Flash Point Live Video: బిగ్ బాస్ బ్యాన్ చేయాలా..? ప్రముఖుల మాటేంటి మరి.. లైవ్ వీడియో..

 వైభవంగా ముందుకు వస్తున్నా ‘మాస్ట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్..: Maestro Pre Release Event Video.

Click on your DTH Provider to Add TV9 Telugu