Naveen Polishetty: జోరు పెంచిన జాతిరత్నం.. నయా సినిమాను అనౌన్స్ చేసిన నవీన్ పోలిశెట్టి

యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి మొదట తెలుగులో కంటే హిందీలో పేరు తెచ్చుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'  సినిమా కంటే ముందు బాలీవుడ్‌లో సినిమాలు చేశాడు.

Naveen Polishetty: జోరు పెంచిన జాతిరత్నం.. నయా సినిమాను అనౌన్స్ చేసిన నవీన్ పోలిశెట్టి
Naveen
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 15, 2021 | 1:10 PM

Naveen Polishetty: యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి మొదట తెలుగులో కంటే హిందీలో పేరు తెచ్చుకున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’  సినిమా కంటే ముందు బాలీవుడ్‌లో సినిమాలు చేశాడు. అంతకు ముందు మహేష్ నటించిన 1 నేనొక్కడినే అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు నవీన్. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తో కంప్లీట్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకునన్న నవీన్.. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక జాతి రత్నాలు సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కుర్రహీరో ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది. నవీన్  పోలిశెట్టి ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ మధ్య అనుష్కతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

తాజాగా నవీన్ పోలిశెట్టి ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించాడు. కళ్యాణ్ శంకర్‌తో నవీన్ పోలిశెట్టి సినిమా చేస్తున్నాడు. ఇది వినోదాత్మకంగా సాగే ఒక యూనిక్ కాన్సెప్ట్ అని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో నవీన్ సరికొత్తగా కనిపించనున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూకుడు మీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మరిన్ని ఇక్కడ  చదవండి : 

Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..

Love Story : సెన్సార్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల సినిమా.. లవ్ స్టోరీ మూవీ ఎన్నిగంటలంటే..

Singer Mangli: నితిన్ గురించి మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు హీరోలాగే లేడంటూ.