Shruti Haasan: డైరెక్టర్‏తో శ్రుతిహాసన్ ఆటలు.. సలార్ సెట్లో బ్యూటీ సందడి మాములుగా లేదుగా..

స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది శ్రుతి హాసన్. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో

Shruti Haasan: డైరెక్టర్‏తో శ్రుతిహాసన్ ఆటలు.. సలార్ సెట్లో బ్యూటీ సందడి మాములుగా లేదుగా..
Shrutihaasan
Follow us

|

Updated on: Sep 15, 2021 | 2:59 PM

స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది శ్రుతి హాసన్. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని మళ్లీ ఫాంలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత శ్రుతి హాసన్‏కు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్స్ ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. అటు సినిమాతోపాటు.. సోషల్ మీడియాలో శ్రుతి హాసన్ ఎల్లప్పుడూ యాక్టివ్‏గా ఉంటూ.. అభిమానులకు టచ్‏లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలతోపాటు.. సినిమాలకు సంబంధించిన విషయాలను రెగ్యూలర్‏గా నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది శ్రుతి హాసన్. తాజాగా ఈ అమ్మడు ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. సలార్ సెట్‏లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏ను ఆట పట్టిస్తున్న వీడియోను షేర్ చేసింది శ్రుతి. నాకు ఇష్టమైన దర్శకుడిని విసిగిస్తున్నాను. నాకున ఇష్టమైన పని చేసి నా ఫేవరేట్ ‏డైరెక్టర్‎కు కోపం తెప్పిస్తున్నాను అంటూ వీడియోను తన ఇన్‏స్టా స్టోరీలో అప్లోడ్ చేసింది. సెట్స్ లో ఫోన్ వాడటం ప్రశాంత్ నీల్ కు ఇష్టం ఉండదని.. శృతి హాసన్ మాత్రం గ్యాప్ దొరికితే ఫోన్ పట్టుకుని ఉంటుంది. అందుకే నాకు ఇష్టమైన పని అంటే ఫోన్ పట్టుకుని వీడియో తీయడం చేస్తూ ప్రశాంత్ నీల్ ను విసిగిస్తున్నట్లుగా శృతి హాసన్ పేర్కొంది. శృతి హాసన్ వీడియో తీస్తున్న సమయంలో కాస్త ఇరిటేషన్ రియాక్షన్ ను ప్రశాంత్ నీల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సలార్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ప్రభాస్ సలార్ సినిమాతోపాటు.. అదిపురుష్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: Nani: చిన్నారి హత్యాచార ఘటనపై స్పందించిన న్యాచురల్ స్టార్… ఏమన్నాడంటే.

Shyam Singa Roy Movie: శ్యామ్ సింగరాయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..