AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde : సల్మాన్‌తో పూజాహెగ్డే సినిమా ఆగిపోయిందంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

తెలుగుకి ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌లో ఒకరు పూజా హెగ్డే. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతుంది

Pooja Hegde : సల్మాన్‌తో పూజాహెగ్డే సినిమా ఆగిపోయిందంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Salman Khan
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2021 | 12:49 PM

Share

Pooja Hegde : తెలుగుకి ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌లో ఒకరు పూజా హెగ్డే. ఒక లైలా కోసం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతుంది. వరుసగా పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంటుంది పూజా. ఇక ఇప్పుడు తమిళ్‌లోను రాణించాలని చూస్తుంది దళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలో పూజాహెగ్డే  హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసింది ఈ బ్యూటీ.. అలాగే అఖిల్‌కు జోడీగా మస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్నా సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. ఇక తెలుగు, తమిళ్ సినిమాలే కాదు బాలీవుడ్‌లోనూ సినిమా చేస్తూ దూసుకుపోతుంది బుట్టబొమ్మ .

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్లో హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తుంది. ఈ సినిమాకు కభీ ఈద్ కభీ దీపావళి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు దాంతో.. ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను తిప్పికొట్టారు మేకర్స్. సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన మేకర్స్ .. సినిమా ఆగిపోలేదని తెలిపారు. అలాగే ఇప్పటికే సినిమాకోసం సెట్ కూడా నిర్మిస్తున్నారని.. రెండు నెలల్లో సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్’ ఫ్రాంచైజీలో రాబోతున్న పార్ట్ 3‌లో నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..

Love Story : సెన్సార్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల సినిమా.. లవ్ స్టోరీ మూవీ ఎన్నిగంటలంటే..

Singer Mangli: నితిన్ గురించి మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు హీరోలాగే లేడంటూ.

స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??
కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్‌.. శంకర్‌ పాస్‌ అవుతారా ??
గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??
గ్లోబల్‌ స్టేజ్‌లో.. ట్రిపుల్‌ ఆర్‌ హీరోల రేంజ్‌ ఏంటి ??
పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??
దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్‌ కోసమేనా ??
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా
బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్..రణ్‌వీర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్‌ పెంచిన సంక్రాంతి స్టార్స్
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్‌ పెంచిన సంక్రాంతి స్టార్స్
పసి పిల్లలు, బాలింతల కోసం జంపన్న వాగు వద్ద ఉడుకు నీళ్లు
పసి పిల్లలు, బాలింతల కోసం జంపన్న వాగు వద్ద ఉడుకు నీళ్లు
ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్
ఇక జంక్‌ ఫుడ్‌ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్