Leharaayi Lyrical Song: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న లెహరాయి లిరిక్స్..

యంగ్ హీరో అక్కినేని అఖిల్... పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం

Leharaayi Lyrical Song: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న లెహరాయి లిరిక్స్..
Akhil
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2021 | 2:57 PM

యంగ్ హీరో అక్కినేని అఖిల్… పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‎గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా లెహరాయి సాంగ్ విడుదల చేశారు మేకర్స్.

లెహరాయి లెహరాయి.. గుండె ఊహలెగిరాయి.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి.. గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి.. ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి.. కళ్ళలోన దాగి ఉన్న అమ్మాయి.. సొంతమల్లె చేరుతుంటే.. ప్రాణమంత చెప్పలేని హాయి… అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుకుంటుంది. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా..సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇక ఈ పాటతో సిద్ శ్రీరామ్ మరోసారి శ్రోతలను మంత్రముగ్ధులను చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆమని, ఈషారెబ్బా, చిన్మయి కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: కంటతడిపెట్టుకున్న లోబో.. మగాడివైతే ఆడుదువురా అంటూ రెచ్చగొట్టిన ప్రియా. కెప్టెన్సీ టాస్క్‌ రచ్చ..

పట్టువదలని నీలాంబరి.. తిరుగులేని శివగామి.. 50దాటినా తరగని బ్యూటీ.. ఎవర్‌గ్రీన్ రమ్యకృష్ణ: Happy Birthday Ramya Krishnan p

Deepika & Ranveer: చిన్న గ్రామంలో ఇల్లు కొన్న దీపికా దంపతులు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

Naveen Polishetty: జోరు పెంచిన జాతిరత్నం.. నయా సినిమాను అనౌన్స్ చేసిన నవీన్ పోలిశెట్టి