సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి ఊరట.. రఘురామ కృష్ణంరాజు పిటీషన్ తిరస్కరణ
సీబీఐ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు పార్లమెంటుసభ్యులు విజయ సాయిరెడ్డికి ఊరట లభించింది.
AP CM YS Jagan Relief: సీబీఐ కోర్టులో జగన్‌కు రిలీఫ్ లభించింది.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేసింది సీబీఐ కోర్టు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు.. జగన్‌తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని కోరారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. విచారణ జరిపిన న్యాయస్థానం రఘురామ పిటిషన్లను కొట్టివేసింది..
సీబీఐ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు పార్లమెంటుసభ్యులు విజయ సాయిరెడ్డికి ఊరట లభించింది. సీఎం జగన్, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఏపీ సీఎం జగన్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు.. రఘురామ కృష్ణంరాజు పిటీషన్‌ను తిరిస్కరిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారంటూ జూన్ 4న రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుతో సంబంధం లేని రఘురామ పిటిషన్ విచారణ అర్హతపై మొదట సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. రఘురామ వాదనతో ఏకీభవించిన సీబీఐ న్యాయస్థానం.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సైతం తిరస్కరించింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు సైతం ఇవాళ కొట్టివేసింది.
అయితే, రఘురామ దాఖలుచేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. Read Also… Space Tour: అంతరిక్షంలోకి వెళ్లనున్న ఆ నలుగురు.. ఎందుకోసం.. ఎప్పుడు.. తెలుసుకుందాం..