Priyanka Gandhi Vadra: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్రియాంక.. బిగ్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్న కాంగ్రెస్

2022 కోసం నేషనల్ కాంగ్రెస్ ఇప్పటి నుంచి ఓ పథకాన్ని అమలు చేసే పనిలో పడింది. ఈసారి ఆ వ్యవహారాన్ని ప్రియాంక పూర్తిస్థాయిలో రంగంలోకి దింపేందుకు చేస్తున్నారు.

Priyanka Gandhi Vadra: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ప్రియాంక.. బిగ్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్న కాంగ్రెస్
Priyanka Gandhi
Follow us

|

Updated on: Sep 15, 2021 | 2:32 PM

2022 కోసం నేషనల్ కాంగ్రెస్ ఇప్పటి నుంచి ఓ పథకాన్ని అమలు చేసే పనిలో పడింది. ఈసారి ఆ వ్యవహారాన్ని ప్రియాంక పూర్తిస్థాయిలో రంగంలోకి దింపేందుకు చేస్తున్నారు. 2022లో జరుగబోయే ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ యాక్షన్‌ప్లాన్‌ మొదలుపెట్టింది. తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసేందుకు ప్రియాంకగాంధీ వాద్రా ముందుకొస్తున్నారు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రియాంక నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌కు పట్టున్న రాయ్‌బరేలి, ఆమేథి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి నామినేషన్‌ వేసేందుకు ప్రియాంక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీగా, యూపీ ఇంఛార్జీగా ఉన్న ప్రియాంక వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రియాంక వాద్రా పోటీ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన వారు ఎవరూ లేరు. ప్రియాంక పోటీ చేస్తే తొలి వ్యక్తి అవుతారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ.. ఇలా అందరూ లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీచేశారు. అయితే, ప్రియాంక మాత్రం యూపీ అసెంబ్లీపైనే గత కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. ఆమేథి లేదా రాయ్‌బరేలీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటుండగా.. ఆమేథి లోక్‌సభపై కన్నేశారని మరికొందరు చెప్తున్నారు.

403 అసెంబ్లీ సీట్లున్న దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో, జవసత్వాలు కోల్పోయిన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తోంది. ఇదే జరిగితే ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర సారధ్య బాధ్యతలు చేపట్టిన తొలి గాంధీ కుటుంబీకురాలిగా ప్రియాంక గాంధీ చరిత్రలో నిలుస్తారు. యూపీలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీలు ఇది వరకే తమ ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా పావులు కదుపుతోంది.

ప్రియాంక గాంధీకి పూర్తి స్థాయి రాష్ట సారధ్య బాధ్యతలు అప్పజెప్పి, అత్యధిక స్థానాల్లో పాగా వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో లక్నోలోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి మరమత్తులు కూడా మొదలు పెట్టింది. ప్రియాంక గాంధీ తన నివాసాన్ని గురుగావ్‌ నుంచి లక్నోకు మారుస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆమె పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టడం లాంఛనమే అని తెలుస్తోంది. 2019 జనవరిలో రాష్ట్రంలోని తూర్పు ప్రాంత ఇంచార్జీగా నియమితురాలైన ప్రియాంక, ఆతరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయారు.

ఆమె ఇంచార్జీగా ఉన్న ప్రాంతంలో ఆమె సోదరుడు రాహుల్‌ గాంధీ(అమేధీ) సైతం ఓటమిపాలయ్యారు. ఆమె సారధ్యంలో కేవలం ఆమె తల్లి సోనియా గాంధీ(రాయ్‌బరేలీ) మాత్రమే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెకు పూర్తి స్థాయి రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పడం చర్చనీయాంశంగా మారింది. గత 32 సంవత్సరాలుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోవడంతో క్యాడర్‌ మొత్తం చెదిరిపోయిందని, ప్రియాంక రాకతో పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: నెల్లూరులో దారుణం.. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

Viral Video:నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!