Viral Video:నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..

పెట్‌ అంటే పంచ ప్రాణాలు.. పెట్‌ కోసం ఏదైనా చేసేందుకు, ఎంతఖర్చు చేసి కొనేందుకు పెట్‌ లవర్స్‌ వెనకడుగు వేయట్లేదు. తమ పిల్లల్ని ఎంత గారాబంగా చూసుకుంటారో.. అంతకంటే ఎక్కువగా...

Viral Video:నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..
Puppies Swimming
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 15, 2021 | 10:26 AM

పెట్‌ అంటే పంచ ప్రాణాలు.. పెట్‌ కోసం ఏదైనా చేసేందుకు, ఎంతఖర్చు చేసి కొనేందుకు పెట్‌ లవర్స్‌ వెనకడుగు వేయట్లేదు. తమ పిల్లల్ని ఎంత గారాబంగా చూసుకుంటారో.. అంతకంటే ఎక్కువగా పెట్‌ను చూసుకుంటున్నారు. కుక్కల పెంపకంపై నగరవాసులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్, షాపింగ్, పార్లర్, ఫంక్షన్‌ ఇలా ఎక్కడికెళ్లినా స్నేహితుడిలా, ఆప్తుడిలా, కాపలాదారుడిలా వెంట తెచ్చుకుంటూ మురిసిపోతున్నారు.మనిషి తన జీవితంలో పెంపుడు జంతువులు ఒక భాగమయ్యాయి. కుక్క, పిల్లి, కుందేలు లాంటివి పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. అలానే వాటి ఆలనా పాలన చూస్తూ తెగ ముచ్చటపడిపోతుంటారు. ఇలా తమ పప్పి డాగ్స్‌కు సొంత పిల్లల్లా అన్నింటిలో ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తున్నాయి. ఇది కొన్ని కారణాల వల్ల ప్రజల దృష్టిని తన వైపు ఆకర్షిస్తుంది. ఈ రోజు మళ్లీ కొన్ని చిన్న కుక్క పిల్లకు ఒక వ్యక్తి స్విమ్మింగ్‌లో శిక్షణ ఇవ్వడం చూడవచ్చు.

ఈ వీడియో ఇవాళ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక వ్యక్తి నీటి చెరువులో నిలబడి చిన్న బుజ్జి కుక్కలకు ఒక్కొక్కటిగా ఈత నేర్పిస్తున్నాడు. అదే సమయంలో కొలనులో ఈత కొట్టిస్తూ.. ఆనందిస్తున్నాడు.

వీడియో ఇక్కడ చూడండి-

సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌కు అందమైన ఈత పాఠాలు అంటూ ఓ మంచి ట్రాగ్ లైన్ పెట్టారు.. ఈ వీడియోను ఇప్పటివరకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. దీనితో పాటు నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియో ట్విట్టర్ ఖాతా @hopkinsBRFC21 ద్వారా షేర్  చేయబడింది. hopkinsBRFC21 ప్రతిరోజూ అలాంటి అనేక వీడియోలను షేర్ చేస్తుంటారు. వీటిని యూజర్లు ఆసక్తికి చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Mudanammakalu: కడుపునొప్పికి భూత వైద్యురాలి ట్రీట్మెంట్.. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు.. కట్ చేస్తే..

100 Years: మొదటి ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు వందేండ్లు.. ఇవాళ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు..