Mudanammakalu: కడుపునొప్పికి భూత వైద్యురాలి ట్రీట్మెంట్.. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు.. కట్ చేస్తే..

సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మనుషుల మూఢనమ్మకాలు మాత్రం దూరం కావట్లేదు. మూఢ నమ్మకాల మత్తులో అభాగ్యుల జీవితాలు నాశనమైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

Mudanammakalu: కడుపునొప్పికి భూత వైద్యురాలి ట్రీట్మెంట్.. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు.. కట్ చేస్తే..
Mudanammakalu
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 15, 2021 | 8:07 AM

సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా.. మనుషుల మూఢనమ్మకాలు మాత్రం దూరం కావట్లేదు. మూఢ నమ్మకాల మత్తులో అభాగ్యుల జీవితాలు నాశనమైన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. కరకగూడెం మండలం అశ్వపురపాడు అనే వలస గొత్తికోయ గ్రామంలో దారుణం జరిగింది. అనోలోచిత నిర్ణయాలకు, మూఢ నమ్మకాలకు రెండు ఏళ్ల బాలుడు బలయ్యాడు. బాలుడికి కడుపునొప్పి రావడంతో భూత వైద్యురాలిని ఆశ్రయించారు తల్లిదండ్రులు.  కడుపు నొప్పి తగ్గిస్తానని బాలుడి బొడ్డు చుట్టూ కోరికింది దేవరబాల. కడుపు నొప్పి తగ్గక పోగా ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిమిష.. నిమిషానికి బాలుడి పరిస్థితి క్షీణిస్తుండటంతో వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. అయితే బాలుడి కడుపులో చిన్న పేగు తెగిపోయిందని వైద్యులు నిర్ధారించారు. బాలుడికి వైద్యులు చికిత్స చేస్తుండగానే బాలుడు మరణించాడు.

హైటెక్‌ యుగంలోనూ మూఢనమ్మకాలతోనే పలు ప్రాంతాల వాసులు జీవనం గడుపుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఓచోట  చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. మూఢనమ్మకాల పేరిట ఏం చేయడానికైనా జనం సిద్ధపడడం ఆందోళన కలిగిస్తోంది. మూఢనమ్మకానికి బాలుడు ఇలా బలికావడంతో  తల్లి దండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు .

బాలుడి మృతికి కారణమై దేవరబాలపై ఎవరైన ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు స్థానిక పోలీసులు.

ఇవి కూడా చదవండి: Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..?