Hyderabad Crime News: కిడ్నాప్​కు గురైన ఆరేళ్ల బాలికను 24 గంటల్లోనే తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు

Hyderabad Crime News: కిడ్నప్ కు గురైన బాలికను 23 గంటల్లోనే తిరిగి తల్లివద్దకు చేర్చారు హైదరాబాద్ పోలీసులు. మంగళవారం పురానిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో..

Hyderabad Crime News: కిడ్నాప్​కు గురైన ఆరేళ్ల బాలికను 24 గంటల్లోనే తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు
Hyderabad Crime News
Follow us

|

Updated on: Sep 15, 2021 | 8:00 AM

Hyderabad Crime News: కిడ్నప్ కు గురైన బాలికను 23 గంటల్లోనే తిరిగి తల్లివద్దకు చేర్చారు హైదరాబాద్ పోలీసులు. మంగళవారం పురానిహవేలిలోని డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డిసిపి గజరావు భూపాల్ వివరాలను వెల్లడించారు. అంబర్​పేట్​ ఆలీకేఫ్​ ప్రాంతానికి చెందిన ముస్కాన్​ ఆలీ మీర్జా(41) తన కూతురు అల్ఫియా(6)తో కలిసి భిక్షాటన చేస్తుంది. కాగా ఈ నెల 13వ తేదీన ఉదయం 11గంటల సమయంలో చంచల్​గూడలో బిక్షాటన చేస్తుండగా ఓ మహిళ వాళ్ల దగ్గరికి వచ్చి తన పేరు ఫాతిమా అని హఫీజ్​బాబానగర్​లో ఓ స్వచ్చంద సేవా సంస్థ పెద్ద ఎత్తున బట్టలు, డబ్బు దానం (జకాత్​) ఇస్తుంటారని నమ్మబలికింది. వెంటనే వారిని ఆటోలో ఎక్కించుకుని హఫీజ్​బాబానగర్​కు చేరుకుంది. అక్కడే ఉన్న ఓ ఇంటిని మీర్జాకు చూపెట్టింది. ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్లి జకాత్​ తీసుకో అని మాయమాటలు చెప్పింది. ఆటో దిగి కాస్త ముందుకు మీర్జా వెళ్లగానే ఆరేళ్ల మైనర్​ బాలికతో ఆటోలో ఫాతిమా పరారయ్యింది.

మీర్జా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచన్​బాగ్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని సంతోష్​నగర్​ డివిజన్​ ఏసీపీ శివరాం శర్మ పర్యవేక్షణలో ఐదు బృందాలను రంగంలోకి దింపారు. హఫీజ్​బాబానగర్​ నుంచి రెండు ఆటోలను మార్చుతూ ఫాతిమా బాలికతో శంషాబాద్​కు చేరుకుంది. అక్కడి నుంచి షాద్​నగర్​లోని సొంత ఇంటికి బాలికను కిడ్నాప్​ చేసి తీసుకువెళ్లినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంటనే ఫాతిమాగా చెప్పుకున్న ఆసియా బి(26) ను అదుపులోకి తీసుకుని కిడ్నాపర్​ చెర నుంచి బాలికకు విముక్తి కలిగించారు. శంషాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆసియాబి పై అక్రమంగా రేషన్​ బియ్యం తరలింపు కేసు కూడా ఉన్నట్లు డిసిపి పేర్కొన్నారు. ఈ సమావేశంలో దక్షిణమండలం అదనపు డిసిపి సయ్యద్​ రఫిక్, సంతోష్​నగర్​ ఏసీపీ శివరాం శర్మ, కంచన్​బాగ్​ ఇన్​స్పెక్టర్​ జి. వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reporter:  నూర్ మహమ్మద్ Hyderabad tv9 telugu

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయంటే..

పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం